Thursday, March 12, 2026
Homeస్పోర్ట్స్IPL: ఢిల్లీపై భారీ విజయం - ప్లే ఆఫ్స్ కు చెన్నై

IPL: ఢిల్లీపై భారీ విజయం – ప్లే ఆఫ్స్ కు చెన్నై

చెన్నై సూపర్ కింగ్స్ 2023 ఐపీఎల్ సీజన్ ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. నేడు ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై 77 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.  టాస్ గెలిచిన చెన్నై బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి వికెట్ కు రుతురాజ్ గైక్వాడ్- డెవాన్ కాన్వేలు 141 పరుగులు జోడించారు. 50 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 79; కాన్వే 52 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 87; శివమ్ దూబే 9 బంతుల్లో 3 సిక్సర్లతో 22;  చివర్లో జడేజా దూకుడుగా ఆది 7 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్ తో 20(నాటౌట్)పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 223 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, నార్త్జ్ లు తలా ఒక వికెట్ పడగొట్టారు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. పృథ్వీ షా(5); ఫిల్ సాల్ట్ (3); రీలీ రోస్సో(డకౌట్) లు విఫలమయ్యారు. జట్టులో కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఒక్కడే 58 బంతుల్లో 7 ఫోర్లు,5 సిక్సర్లతో 86 పరుగులు చేసి ఏడో వికెట్ గా వెనుదిరిగాడు. మిగిలిన వారిలో అక్షర్ పటేల్-15; యష్ దుల్-13 మాత్రమే రెండంకెల స్కోరు దాటారు. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది.

చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ 3; మహీష్ తీక్షణ, మతీష ప్రతిరణ చెరో 2;  తుషార్ దేశ్ పాండే, రవీంద్ర జడేజా చెరో వికెట్ పడగొట్టారు.

రుతురాజ్ గైక్వాడ్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular