Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్ఐపీఎల్ ప్రాక్టీస్ షురూ

ఐపీఎల్ ప్రాక్టీస్ షురూ

వచ్చే నెలలో పునఃప్రారంభం కానున్న ఐపీఎల్ 14 వ సీజన్ హడావుడి మొదలైంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తన సాధన మొదలు పెట్టింది. కోవిడ్ కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ మధ్యలోనే నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే పరిస్థితులు కాస్త కుదుట పడడంతో సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15వరకూ ఈ సీజన్ ను తిరిగి  నిర్వహిస్తున్నారు.  అయితే ఇండియాలో కాకుండా దుబాయ్, యూఏఈ ల్లో మిగిలిన మ్యాచ్ లు జరుపుతున్నారు.

సీజన్ కు మరో నెల మాత్రమే గడువు ఉండడంతో ప్రాక్టీస్ కోసం ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు దుబాయ్ చేరుకోగా మిగిలిన జట్లు విడతల వారీగా దుబాయ్ చేరుకుంటాయి. మహేంద్ర సింగ్ ధోనీ సారధ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గురువారం నుంచి తమ సాధన మొదలు పెట్టింది. డిపెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్ జట్టు శుక్రవారం నుంచి తమ ప్రాక్టీస్ ఆరంభిస్తుంది.

విరాట్ కోహ్లీ నేతృత్వంలో ఇరవై మంది భారత క్రికెట్ జట్టు సభ్యులు ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో ఆడుతున్నారు. ఇప్పటికే రెండు టెస్టులు పూర్తయ్యాయి. లార్డ్స్ లో జరిగిన రెండో టెస్టులో  ఇండియా 151 పరుగులతో విజయం సాధించింది. ఐదు టెస్టులు పూర్తి కాగానే ఈ జట్టులో ఒకరిద్దరు మినహా మిగిలిన అందరూ ఐపీఎల్ ఆడేందుకు నేరుగా దుబాయ్ చేరుకుంటారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్