Tuesday, March 19, 2024
HomeTrending Newsచంద్రగిరి బరిలో మోహిత్ రెడ్డి !

చంద్రగిరి బరిలో మోహిత్ రెడ్డి !

రాబోయే ఎన్నికల్లో చంద్రగిరి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డి బరిలోకి దిగుతున్నట్లు సమాచారం.   ఈ మేరకు ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తిరుపతిలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు, వరుసగా రెండుసార్లు ఆయన ఇక్కడినుంచి గెలుపొందారు. జగన్ సిఎం అయిన తరువాత, గత ఏడాది మంత్రివర్గవిస్తరణ సమయంలో కూడా తనకు మంత్రి పదవి వద్దని, ఏ బాధ్యత అప్పగించినా చేస్తానని ఆయనే స్వయంగా ప్రకటించారు.  ఎమ్మెల్యేలతో పాటు తుడా ఛైర్మన్ గా, టిటిడి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా కూడా భాస్కర్ రెడ్డి ప్రస్తుతం కొనసాగుతున్నారు.

అయితే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని, కుమారుడు మోహిత్ రెడ్డికి సీటు ఇవ్వాలని కొద్దిరోజులుగా జగన్ ను కోరుతున్నారు. ఇటీవలే ఈ ప్రతిపాదనకు జగన్ అంగీకరించినట్లు తెలుస్తోంది. మోహిత్ రెడ్డి ప్రస్తుతం తిరుపతి రూరల్ ఎంపిపిగా  ఉన్నారు.  కొడుక్కి సీటు ఇప్పించి….  పార్టీ ఎన్నికల కమిటీ లో కీలక బాధ్యతలు భాస్కర్ రెడ్డి  పోషిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

కాగా, చాలా మంది వైసీపీ నేతలు తమ వారసులను బరిలోకి దించాలని యోచిస్తున్నారు.  భూమన కరుణాకర్ రెడ్డి, పేర్ని నాని, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు వచ్చే ఎన్నికల్లో తమ వారసులకు టిక్కెట్లు కేటాయించాలని కోరుతూ వస్తున్నారు. అయితే జగన్ వీరిలో ఎవరికీ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఈసారికి మీరే పోటీ చేయాలని వారికి స్పష్టం చేశారు.  ఇప్పుడు చెవిరెడ్డికి సిఎం ఒకే చెప్పడంతో మిగిలిన వారు కూడా వారసుల కోసం ఒత్తిడి తెచ్చే అవకాశముంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్