Tuesday, March 10, 2026
HomeTrending NewsChandrayan-3: దేశ ప్రజలకు పండుగ రోజు - సిఎం కెసిఆర్

Chandrayan-3: దేశ ప్రజలకు పండుగ రోజు – సిఎం కెసిఆర్

సేఫ్ లాండింగ్ అనే చివరి ఘట్టాన్ని చేరుకోవడం ద్వారా చంద్రయాన్ 3 ప్రయోగం సంపూర్ణ విజయాన్ని సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు.

చంద్రుని దక్షిణ ధ్రువం మీదకు లాండర్ మాడ్యూల్ ను విజయవంతంగా చేర్చిన మొట్ట మొదటి దేశంగా, ప్రపంచ అంతరిక్ష పరిశోధన రంగంలో భారత దేశం సరికొత్త అధ్యాయాన్ని లిఖించిందని, అరుదైన చరిత్రను సృష్టించిందని, సీఎం తెలిపారు.
ఇది ప్రతీ భారతీయుడు గర్వించదగ్గ సందర్భం అని సీఎం కేసీఆర్ అన్నారు.

ఈ సందర్భంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ,ఇస్రో, శాస్త్రవేత్తలకు, సిబ్బందికి.. ఈ ప్రయోగం విజయవంతం కావడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు.

చిరకాల ఆకాంక్ష నెరవేరిన సందర్భంలో యావత్ భారతదేశ ప్రజలకు ఇది పండుగ రోజని సీఎం అన్నారు.

భవిష్యత్ లో ఇస్రో చేపట్టబోయే అంతరిక్ష పరిశోధనలకు, ప్రయోగాలకు చంద్రయాన్ 3 విజయం గొప్ప ప్రేరణినిస్తుందని సీఎం పేర్కొన్నారు.

ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ, దేశ కీర్తి ప్రతిష్టలను మరింతగా పెంచే దిశగా, అంతరిక్ష పరిశోధన రంగంలో ఇస్రో తన విజయపరంపరను కొనసాగించాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular