21.3 C
New York
Thursday, October 5, 2023

Buy now

HomeTrending NewsTelangana Cabinet: మంత్రివర్గంలోకి పట్నం మహేందర్ రెడ్డి

Telangana Cabinet: మంత్రివర్గంలోకి పట్నం మహేందర్ రెడ్డి

ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్యాబినేట్ ను విస్తరించనున్నారు. ఇందులో భాగంగా
మంత్రి వర్గ విస్తరణలో రంగారెడ్డి ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డికి మరో మారు స్థానం దక్కనుంది.

రానున్న ఎన్నికల్లో భాగంగా తాండూర్ నుండి టిఆర్ఎస్ టికెట్ ఆశించిన మహేందర్ రెడ్డికి ఖరారు కాలేదు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకు అధిష్టానం టికెట్టు ఖరారు చేసిన నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితులలో రాజకీయ సమీకరణ కోసం మహేందర్ రెడ్డికి మంత్రి పదవి అనూహ్యంగా దక్కుతోంది.

మంత్రిగా మహేందర్ రెడ్డి రెండవసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ తొలి క్యాబినెట్ లో రవాణా శాఖ మంత్రిగా 2 జూన్ 2014న ఆయన సీఎం కేసీఆర్ క్యాబినెట్ లో మంత్రి పదవి ప్రమాణస్వీకారం చేసి 8 జూన్ 2014న బాధ్యతలను చేపట్టారు.

అనంతరం 2018 వరకు మంత్రిగా కొనసాగి గత సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. అనంతరం మహేందర్ రెడ్డికి పార్టీ అధినేత ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు.

జూన్ 2019లో అతడు కొడంగల్ లో ఎమ్మెల్యేగా గెలిచిన పట్నం నరేందర్ రెడ్డి స్థానంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందారు. అనంతరం రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో05.02.22 ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అప్పటినుండి రంగారెడ్డి జిల్లాతో పాటు తాండూర్ రాజకీయాల్లో ఆయన చురుకుగా ఉన్నారు. తాండూరులో సిట్టింగుకు టికెట్ కేటాయించిన నేపథ్యంలో జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పగల సత్తా ఉన్న మహేందర్ రెడ్డికి మంత్రివర్గంలో అనూహ్యంగా స్థానాన్ని కల్పించారు. ఇలా మహేందర్ రెడ్డి రెండో సారి రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

1994- 98, 1998 – 2004, 2009 – 2014, 2014 – 20018 వరకు తాండూరు ఎంఎల్ఏ గా మహేందర్ రెడ్డి ఎన్నికైనారు. 2018 ఎన్నికల్లో తాండూర్ నుండి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మహేందర్ రెడ్డి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ చేతిలో  ఓటమిపాలవగా కొడంగల్ లో ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై అప్పట్లో ఎమ్మెల్సీగా ఉన్న నరేందర్ రెడ్డి ఘనవిజయం సాధించారు. ఇలా ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని సీఎం కేసీఆర్ మహేందర్ రెడ్డి కి కట్టబెట్టగా ఈ జూన్ 2019లో మొదటిసారి ఆయన Rangareddy local body authority ఎమ్మెల్సీగా విజయం సాధించారు. అనంతరం రెండోసారి ఎమ్మెల్సీగా 5.2.2022 న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

NewsDesk
NewsDesk
'ఐ'ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

న్యూస్