Saturday, April 20, 2024
HomeTrending Newsయాదాద్రి భువ‌న‌గిరి జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోని 421 గ్రామాల అభివృద్ధికి చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించారు. వాసాల‌మ‌ర్రి పుణ్య‌మా అని జిల్లాలోని గ్రామాలు అభివృద్ధి అవుతున్నాయి. ముఖ్య‌మంత్రి నిధి నుంచి ప్ర‌తి గ్రామ పంచాయ‌తీకి రూ. 25 ల‌క్ష‌ల చొప్పున మంజూరు చేస్తున్నాను. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల‌కు కూడా నిధులు మంజూరు చేస్తాను. భువ‌న‌గిరి మున్సిపాలిటికీ రూ. కోటి, మిగ‌తా ఐదు మున్సిపాలిటీల‌కు రూ. 50 ల‌క్ష‌ల చొప్పున మంజూరు చేస్తున్న‌ట్లు సీఎం ప్ర‌క‌టించారు.

త్వ‌ర‌లో గ్రామ అభివృద్ధి క‌మిటీలు ఏర్పాటు చేయాలి. అధికారులు వ‌చ్చి ప్ర‌తి ఇంటి ప‌రిస్థితిని అధ్య‌య‌నం చేయాలి. వాసాల‌మ‌ర్రికి కూడా వంద గ్రామాల ప్ర‌జ‌లు వ‌చ్చి అభివృద్ధి నేర్చుకోని పోవాల‌న్నారు. ఈ గంట నుంచి కులం లేదు, మ‌తం లేదు, జాతి లేదు. మ‌నంద‌రిది ఒకటే కులం. మ‌న‌ది అభివృద్ధి కులం, బాగుప‌డే కులం అని సీఎం పేర్కొన్నారు. ఇలా ముందుకుపోతే త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తామ‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్