Monday, February 24, 2025
HomeTrending Newsరాజీనామా పుకార్లు -యడ్యూరప్ప

రాజీనామా పుకార్లు -యడ్యూరప్ప

కర్ణాటక నాయకత్వ మార్పులపై ముఖ్యమంత్రి యడ్యూరప్ప స్పందించారు. రాజీనామా ఊహాగానాలను ఖండించారు. ‘‘సీఎం పదవికి రాజీనామా చేయడంలేదు. కర్ణాటకలో పార్టీ అభివృద్ధిపై జేపీ నడ్డాను కలిసి చర్చించాను. నడ్డాకు నాపై సదభిప్రాయం ఉంది. మరోసారి అధికారంలోకి రావడానికి కృషి చేస్తాను’’ అని యడ్యూరప్ప తెలిపారు. ఇటీవల భాజపా సీనియర్‌ నేత, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప గవర్నర్‌కు యడ్యూరప్పపై ఫిర్యాదు చేయడం కన్నడ రాజకీయాల్లో కలకలం రేపాయి. సీఎం తన శాఖలో జోక్యం చేసుకుంటున్నారని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లడం చర్చనీయాంశమైంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్