Nation Mourns for Bipin Rawat :
తమిళనాడులోని కూనూరులో ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) బిపిన్ రావత్ దుర్మరణం పాలయ్యారు. ఈ విషయాన్ని ఆర్మీ అధికారికంగా ధృవీకరించింది. ఈ చాపర్ లో ప్రయాణిస్తున్న మొత్తం 14 మందిలో రావత్ దంపతులతో సహా 13 మంది మరణించారని, తీవ్ర గాయాలతో కెప్టెన్ వరుణ్ సింగ్ చికిత్స పొందుతున్నారని ఆర్మీ అధికారులు వెల్లడించారు. బిపిన్ రావత్ 45 ఏళ్ళపాటు దేశ సేవలో తరిస్తూ విధి నిర్వహణలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈనెల 31 తో సిడిఎస్ గా అయన పదవీకాలం ముగియనుంది. వెల్లింగ్ టన్ ఆర్మీ కాలేజీలో ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్ళారు. లాండింగ్ కు ఐదు నిమిషాల ముందే ఈ దుర్ఘటన జరిగింది.
ఉత్తరాఖండ్ లోని పౌరి లో 1958 మార్చి 16న జన్మించిన రావత్ 1978 డిసెంబర్ 18న అయన సైన్యంలో చేరారు. కౌంటర్ ఇన్ సర్జేన్చిలో ఆయనకు విశేషానుభవం ఉంది. గూర్ఖా రైఫిల్స్ లో తన ప్రస్థానం ప్రారంభించిన రావత్ మేజర్ గా యూరి సెక్టార్ లో బాధ్యతలు నిర్వహించారు. బిపిన్ తండ్రి లక్ష్మ సింగ్ రావత్ కూడా ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్ గా పనిచేశారు.
Also Read : కూనూరులో కూలిన డిఫెన్స్ హెలికాఫ్టర్