Sunday, January 19, 2025
HomeTrending Newsమానవహక్కుల కమిషన్ కు చైనా గ్రీన్ సిగ్నల్

మానవహక్కుల కమిషన్ కు చైనా గ్రీన్ సిగ్నల్

China Green Signal To Human Rights Commission :

అంతర్జాతీయంగా ఒత్తిడి పెరగడంతో చైనా ఎట్టకేలకు దిగివచ్చింది. జింజియాంగ్ ప్రావిన్సులో ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిషన్ పర్యటనకు అంగీకారం తెలిపింది. బీజింగ్ ఒలింపిక్స్ తర్వాత జింజియాంగ్ పర్యటనకు రావొచ్చని యుఎన్ మానవహక్కుల కమిషన్ చైర్మన్ మిచేల్లి బచేలేట్ కు అధికారికంగా సమాచారం పంపింది.  2018 సంవత్సరం నుంచి హక్కుల సంఘాలు, అమెరికా ఆన్ని అంతర్జాతీయ వేదికల మీద చైనా దారుణాలను ఏకరువు పెడుతున్నాయి.

వచ్చే రెండు నెలల్లో యుఎన్ మానవహక్కుల కమిషన్ చీఫ్ మిచెల్లీ బాచేలేట్ నేతృత్వంలో బృందం జింజియాంగ్ లో పర్యటిస్తుంది. చైనా వాయువ్యంలోని జింజియాంగ్ ప్రావిన్సులో వుయ్ఘుర్లు, కజాక్ ముస్లీంల మీద చైనా దాష్టికాలు పెరిగాయని అంతర్జాతీయంగా మానవహక్కుల సంఘాలు కొన్నేళ్లుగా ఆందోళనలు చేస్తున్నాయి.

కరోనా అనంతర పరిణామాలతో చైనా మీద ప్రపంచ దేశాల్లో అపనమ్మకం ఏర్పడటం కమ్యూనిస్టు పాలకులకు ఇబ్బందిగా మారింది. అమెరికాకు ధీటుగా పెత్తనం చేయాలని భావిస్తున్న చైనా మానవహక్కుల విషయంలో కాటిన్యం ప్రదర్శిస్తోందని విమర్శలు ఉన్నాయి. టిబెట్ లో భౌద్ధ మత వికాసం జరగకుండా, భౌద్ధ సన్యాసులనునిర్భందించటం, భౌద్ధ ఆరామాలను కూల్చివేయటం విమర్శలకు దారితీసింది. టిబెట్ రాజధాని లాసాలో భౌద్ద్ క్షేత్రాలను కాపాడాలని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ దశాబ్దాలుగా చైనాకు విజ్ఞప్తులు చేస్తున్నా కమ్యూనిస్టు పాలకులు పెడచెవిన పెడుతున్నారు.

Also Read : జనాభా పెరుగుదలకు చైనా పాట్లు

RELATED ARTICLES

Most Popular

న్యూస్