అమెరికా – భారత్ సంబంధాలపై చైనా అక్కసు వెళ్ళగక్కింది. సరిహద్దుల్లో ఎప్పుడు వివాదాలు సృష్టించటం..పొరుగు దేశాలతో కయ్యాలు పెట్టుకునే జగడాల చైనా…భారత్ కు నీతులు ఉపదేశిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనపై చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. చైనా ఆర్ధిక ప్రగతిని అడ్డుకునేందుకే భారత్‌ను అమెరికా అడ్డుపెట్టుకుంటోందని అడ్డగోలు వ్యాఖ్యలు చేసింది. భౌగోళిక రాజకీయ లెక్కలతోనే భారత్‌తో ఆర్ధిక వాణిజ్య బంధాలను పటిష్టం చేసుకునేందుకు అమెరికా సంప్రదింపులు జరుపుతున్నదని చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ ఎడిటోరియల్ పేర్కొంది.
అమెరికా ఇచ్చే హామీలకు కట్టుబడి ఉండదని చైనా అత్యున్నత దౌత్యవేత్త వాంగ్ యి పేర్కొన్నారు. చైనాకు వ్యతిరేకంగా జరిపే బల్క్‌వార్‌లో భారత్‌ను అమెరికా ఉపయోగించుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా భోగోళిక రాజకీయ లెక్కలను అర్ధం చేసుకోవడం కష్టమేమీ కాదని, చైనా ఆర్ధికాభివృద్ధిని కుంటుపరిచేందుకే భారత్‌తో వాణిజ్య సహకారానికి అమెరికా మొగ్గుచూపుతున్నదని చైనా మాజీ విదేశాంగమంత్రి వాంగ్ యి చెప్పుకొచ్చారు.
అంతర్జాతీయ సరఫరా చైన్‌లో చైనా స్ధానాన్ని భారత్ సహా మరే దేశం భర్తీ చేయలేనందున అమెరికా భౌగోళిక రాజకీయ లెక్కలు విఫలమవుతాయని అన్నారు. బీజింగ్‌కు వ్యతిరేకంగా భారత్‌ను ఎగదోసే ఆటలు ఫలించబోవని డ్రాగన్ పేర్కొంది.