Sunday, January 19, 2025
Homeసినిమాడిస్నీ ప్లస్ హాట్ స్టార్ కి సిద్ధార్థ్ 'చిన్నా'

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కి సిద్ధార్థ్ ‘చిన్నా’

సిద్ధార్థ్ హీరోగానే కాదు … నిర్మాతగాను ప్రయోగాలు చేస్తుంటాడు. నిర్మాతగా ఆయన ఎంచుకునే కథలు కూడా డిఫరెంట్ గా ఉంటాయి. గతంలో ఆయన నిర్మించిన ‘అవళ్’ సినిమా, తమిళంలోనే కాకుండా ఇతర భాషల్లోను మంచి వసూళ్లను రాబట్టింది. రీసెంటుగా ఆయన మరో సినిమాను నిర్మించాడు .. ఆ సినిమా పేరే ‘చిత్తా’. అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, సెప్టెంబర్ 28వ తేదీన అక్కడ విడుదలైంది. తొలి రోజునే ఈ సినిమా అక్కడ సక్సెస్ టాక్ తెచ్చుకుంది.

ఆ సినిమాను ఆయన ఇక్కడ ‘చిన్నా‘ టైటిల్ తో, అక్టోబర్ 6వ తేదీన రిలీజ్ చేశాడు. విభిన్నమైన కథాంశంగా ఈ సినిమా ఇక్కడ ప్రశంసలను అందుకుంది. ఈ సినిమా తన కెరియర్లో చాలా కీలకమైనదనీ, ఈ సినిమాను ఆదరించకపోతే ఇకపై తెలుగులో తన సినిమాలు రిలీజ్ చేయనని ప్రమోషన్స్ లో ఉద్వేగంతో సిద్ధార్థ్ చెప్పడం చర్చనీయాంశమైంది. అంతగా ఈ సినిమాలో ఏముందా అని చూసిన ఆడియన్స్ కూడా, కంటెంట్ కి మంచి మార్కులు ఇచ్చారు.

అలాంటి ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 28వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. కథ విషయానికి వస్తే హీరో ఓ  చిన్న ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అతని అన్నయ్య చనిపోవడంతో వదిన .. పాప బాధ్యతను అతను తీసుకోవలసి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లోనే ఓ చిన్నారిపై లైంగిక దాడి చేశాడనే ఆరోపణను హీరో ఎదుర్కోవలసి వస్తుంది. అదే సమయంలో హీరో అన్న కూతురు కిడ్నాప్ కి గురవుతుంది. ఈ సమస్యలను హీరో ఎలా ఎదుర్కున్నాడు? అనేదే కథ. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్