Monday, June 8, 2026
Homeసినిమామెగాస్టార్ మూవీ టైటిల్ ‘గాడ్ ఫాదర్’

మెగాస్టార్ మూవీ టైటిల్ ‘గాడ్ ఫాదర్’

మెగాస్టార్ చిరంజీవి 153వ సినిమాగా లూసిఫర్ రీమేక్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకుడు. మలయాళంలో విజయం సాధించిన లూసీఫర్ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథలో మార్పులు చేర్పులు చేశారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. హైదరాబాద్లోని అల్యూనిమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీ టైటిల్ అంటూ గత కొన్ని రోజులుగా కొన్ని టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి.

అనుకున్నట్టుగానే లూసీఫర్ రీమేక్ కి గాడ్ ఫాదర్ అనే టైటిల్ ఖరారు చేశారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు. ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టైటిల్ ను డిజైన్ చేయించిన తీరు .. చిరు లుక్ కొత్తగా .. ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి. చిరు ఇమేజ్ కి తగ్గట్గుగా గాడ్ ఫాదర్ అనే టైటిల్ పెట్టడంతో ఈ టైటిల్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular