-0.4 C
New York
Thursday, December 7, 2023

Buy now

Homeసినిమాపొన్నాంబళం ఆపరేషన్ కు మెగాస్టార్ సాయం

పొన్నాంబళం ఆపరేషన్ కు మెగాస్టార్ సాయం

కష్టకాలంలో ఉన్న నటులను ఆదుకోవడంలో మెగాస్టార్ చిరంజీవి చాలా చురుకుగా వ్యవహరిస్తున్నారు. చిరంజీవి సినిమాల్లో విలన్ గా నటించిన నటుడు పొన్నాంబళం కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని తెలిసి వెంటనే స్పందించారు. ఆయనకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం రెండు లక్షల రూపాయలను పొన్నాంబళం బ్యాంకు అకౌంటుకు గురువారం ట్రాన్స్ ఫర్ చేశారు. పొన్నాంబళం చెన్నైలో నివాసముంటారు. అక్కడే కిడ్నీ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు.

చిరంజీవి అన్నయ్యా.. మీ సాయం మరువలేను : పొన్నాంబళం

‘చిరంజీవి అన్నయ్యకు నమస్కారం. చాలా ధన్యవాదాలు అన్నయ్యా… నాకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ కోసం మీరు పంపిన రెండు లక్షల రూపాయలు చాలా ఉపయోగపడ్డాయి. ఈ సహాయాన్ని నేనెప్పటికీ మరచిపోలేను. మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆ దేవుడు ఆంజనేయస్వామి మిమ్మల్ని చిరంజీవిగా ఉంచాలని కోరుకుంటూ… జై శ్రీరామ్‌’ అంటూ తన సందేశాన్ని తమిళంలో వీడియో రూపంలో పంపారు పొన్నాంబళం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్