Saturday, January 18, 2025
Homeసినిమాఆ న‌లుగురినీ చిరు ప‌క్క‌న‌పెట్టేశారా..?

ఆ న‌లుగురినీ చిరు ప‌క్క‌న‌పెట్టేశారా..?

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ గాడ్ ఫాద‌ర్. ఈ చిత్రానికి మోహ‌న‌రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 5న ఈ సినిమా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. దీనితో పాటు వాల్తేరు వీర‌య్య‌, భోళా శంక‌ర్ సినిమాలు చిరంజీవి చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎప్పుడూ లేని విధంగా వ‌రుస‌గా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే.. చిరంజీవి ఇప్పుడు ఆ న‌లుగురు ద‌ర్శ‌కుల‌ను ప‌క్క‌న‌పెట్టేశార‌ని టాక్ వినిపిస్తోంది.

ఇంత‌కీ ఆ న‌లుగురు ద‌ర్శ‌కులు ఎవ‌రంటే… ముందుగా చెప్పుకోవాల్సింది మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్.  ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి స్వ‌యంగా త్రివిక్ర‌మ్ తో సినిమా చేయాలనుకుంటున్న విష‌యాన్ని చెప్ప‌డం.. అక్క‌డే ఉన్న త్రివిక్ర‌మ్ కూడా సినిమా చేస్తాన‌ని చెప్ప‌డం జ‌రిగింది.

ఈ ప్రాజెక్ట్ గ‌త కొంత‌కాలంగా వార్త‌ల్లో ఉంటుంది కానీ.. సెట్స్ పైకి మాత్రం రావ‌డం లేదు. ఇక త్రివిక్ర‌మ్ ని ప‌క్క‌న‌పెట్టేశారని టాక్ వినిపిస్తోంది. అలాగే డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తో కూడా చిరంజీవి ఎప్ప‌టి నుంచో సినిమా చేయాలి అనుకుంటున్నారు కానీ.. సెట్ కావ‌డం లేదు. యంగ్ డైరెక్ట‌ర్స్ మారుతితో ఓ సినిమా, వెంకీ కుడుముల‌తో ఓ సినిమా చేయాలి అనుకున్నారు కానీ.. ఈ ప్రాజెక్టులు సెట్ కాలేదు. త్రివిక్ర‌మ్, పూరి, మారుతి, వెంకీ కుడుముల‌.. ఈ న‌లుగురు ద‌ర్శ‌కుల‌ను చిరు ప‌క్క‌న పెట్టేశార‌ని.. వీళ్ల‌తో సినిమాలు ఉండ‌క‌పోవ‌చ్చు అని టాక్ బ‌లంగా వినిపిస్తోంది. మ‌రి.. భ‌విష్య‌త్ లో మెగాస్టార్ వీళ్ల‌తో సినిమా చేస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్