Saturday, January 18, 2025
Homeసినిమామెగా మదర్ చేతుల మీదుగా 'ది 100' టీజర్ రిలీజ్!

మెగా మదర్ చేతుల మీదుగా ‘ది 100’ టీజర్ రిలీజ్!

చిరంజీవి తల్లి అంజనమ్మ అంటే ఇండస్ట్రీలో అందరికీ ఎంతో గౌరవం .. మరెంతో అభిమానం. తన తనయుడు మెగా స్టార్ గా దశాబ్దాలుగా ఇండస్ట్రీని ఏలుతున్నప్పటికీ, మెగా ఫ్యామిలీ నుంచి ఇంతమంది  హీరోలు ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ ఆమె చాలా సింపుల్ గా కనిపిస్తారు. ఆమె మాట్లాడటం చాలా తక్కువ. అలాగే సినిమాకి సంబంధించిన ఫంక్షన్స్ లో ఆమె కనిపించడం కూడా చాలా తక్కువ. తన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆమె తన బిడ్డల మాదిరిగానే ఆత్మీయంగా పలకరిస్తారు. ఆమె ఆశీస్సులు లభిస్తే చాలనుకునే యంగ్ హీరోలు చాలామందినే ఉన్నారు.

అలా అంజనమ్మ ఆశీస్సులు అందుకున్న సాగర్ .. తన తాజా చిత్రమైన ‘ది 100’ సినిమా టీజర్ ను అంజనమ్మ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. సాగర్ ‘మొగలి రేకులు’ సీరియల్ ద్వారా ‘మినీతెర మెగాస్టార్’ అనిపించుకున్నాడు. ఆ సీరియల్ లో ఆయన పోషించిన ఆర్కే నాయుడు పాత్ర ఆయనకి చాలా పాప్యులారిటీని తెచ్చిపెటింది. ఆ సీరియల్ ను అంజనమ్మ ప్రతి రోజూ చూసేవారనీ, ఆ విషయం నాగబాబుగారు తనతో చెబితే తాను వెళ్లి ఆమె ఆశీస్సులు తీసుకున్నానని చాలా ఇంటర్వ్యూలలో సాగర్ చెబుతూ వచ్చాడు.

అతని పట్ల అంజనమ్మకి గల అభిమానం వల్లనే ఆమె ‘ది 100’ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమా విజయవంతమై సాగర్ మరింతగా ఎదగాలని ఆమె ఆశీర్వదించారు. క్రియా కార్పొరేషన్ సంస్థ నుంచి రమేశ్ కరుటూరి .. వెంకీ పుషడపు .. తారక్ రామ్ ఈ సినిమాను నిర్మించారు. సాగర్ తనకి అచ్చొచ్చిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఈ సినిమాలో కనిపించనున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, వచ్చేనెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్