Wednesday, March 18, 2026
Homeసినిమాచిరుతో రాధిక మూవీ కన్ ఫర్మ్?

చిరుతో రాధిక మూవీ కన్ ఫర్మ్?

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన వరుస సినిమాలతో దూసుకు వెళ్తున్నారు. యువహీరోలకంటే వేగంగా సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య సంక్రాంతి విడుదలకు సిద్హమవుతోంది.  ఈ సినిమా తర్వాత మోహర్ రమేష్ డైరెక్షన్ లో చేస్తున్న భోళా శంకర్ మూవీని ఉగాదికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీని తర్వాత భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుములతో ఓ సినిమా చేయనున్నట్టు ప్రకటించారు కానీ.. ఫైనల్ నెరేషన్ సంతృప్తికరంగా లేకపోవడంతో నో చెప్పినట్టు సమాచారం.

అయితే.. రాధిక బ్యానర్ లో సినిమా చేసేందుకు చిరంజీవి ఓకే చెప్పారని తెలిసింది. ఒకప్పుడు తనతో వరుసగా సినిమాలు చేసిన రాధికతో పాటు ఆమె భర్త శరత్ కుమార్ అంటే చిరుకు ప్రత్యేక అభిమానం ఉంది. శరత్ హీరోగా స్థిరపడకముందు, తనతో గ్యాంగ్ లీడర్ చేస్తున్న టైంలోనే అతడిని ఆదుకోవడానికి చిరు అప్పట్లో ముందుకొచ్చాడు. ఆర్థిక సమస్యల్లో ఉన్న తనను బయటపడేయడానికి తన ప్రొడక్షన్లో సినిమా చేయడానికి చిరు ముందుకు వచ్చాడని, పారితోషకం గురించి కూడా మాట్లాడకుండా సినిమా చేసుకోమని చెప్పాడని ఓ సందర్భంలో శరత్ కుమార్ చెప్పారు. అయితే.. అనుకోకుండా అదే టైంలో తాను హీరోగా బ్రేక్ అందుకోవడంతో ఆ సినిమా చేయాల్సిన అవసరం పడలేదు అన్నారు.

అయితే.. ఇప్పుడు రాధిక తన బ్యానర్ లో సినిమా చేయమని అడగడం… చిరు ఓకే అనడం జరిగిందని.. ప్రస్తుతం రాధిక చిరంజీవికి సరిపోయే స్టోరీ కోసం చూస్తుందని సమాచారం. మరి.. చిరుతో రాధిక చేసే సినిమాని ఎవరు డైరెక్ట్ చేస్తారో..? క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular