Wednesday, April 17, 2024
Homeసినిమాఅన్ స్టాపబుల్ ప్రొమోతో అదరగొట్టిన ప్రభాస్

అన్ స్టాపబుల్ ప్రొమోతో అదరగొట్టిన ప్రభాస్

నటసింహం నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షోతో విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ఈ షో ఫస్ట్ సీజన్ తో అదరగొట్టిన బాలయ్య.. ఇప్పుడు సెకండ్ సీజన్ ను మరింత రసవత్తరంగా నడిపిస్తున్నారు.

అయితే.. రీసెంట్ ఎపిసోడ్ కు ప్రభాస్ ను ఆహ్వానించారు. అతనితో పాటు ఫ్రెండ్ గోపీచంద్ ను కూడా పిలిచారు. ప్రభాస్ ఆహా షో కోసం వస్తున్నాడని తెలిసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఈ ఎపిసోడ్ ప్రసారం అవుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే.. ఈ ఎపిసోడ్ కు సంబంధించి ప్రోమో విడుద‌ల చేశారు. నిజానికి ప్ర‌భాస్ కి చాలా సిగ్గు ఎక్కువ. పెద్ద‌గా మాట్లాడ‌డు. కానీ.. బాల‌య్య మ‌హ‌త్య‌మో ఏమో…. ఈ షోలో.. ప్ర‌భాస్ మాట్లాడుతూనే ఉన్నాడు. ఎక్కువ సైటైర్లు ప్ర‌భాస్ నుంచే ప‌డ్డాయి. చాలా జోవియ‌ల్‌గానూ ఉన్నాడు.

ఈ షోలో డైరెక్ట్‌గా చ‌ర‌ణ్‌కి కాల్ చేశాడు ప్ర‌భాస్‌. వారిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన సంభాషణ అయితే.. ఈ షో మొత్తానికి హైలెట్ అని చెప్పచ్చు. చ‌ర‌ణ్ నువ్వు నా ఫ్రెండువా..? శ‌త్రువువా..? అంటూ.. ఫోన్లోనే స‌ర‌దాగా కంప్లైంట్ చేశాడు ప్ర‌భాస్‌. అంతలా వారిమధ్య జరిగిన సంభాషణ ఏంటి అనేది ఆసక్తిగా మారింది. ల‌వ్ మేట‌ర్లు.. పెళ్లి విష‌యాలూ.. ఇలా చాలానే ఈ షోలో ప్రస్తావనకు వచ్చాయి. ఈ ఎపిసోడ లో  గోపీచంద్ వ‌చ్చాక అన్ స్టాప‌బుల్ ఎమోష‌న‌ల్ ట‌చ్ వైపు మ‌ళ్లింద‌నిపిస్తోంది. వారిద్దరి మధ్య స్నేహం తదితర విష‌యాలు ఈ షోలో ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చాయి. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రొమో ట్రైండింగ్ లో నిలిచింది. మరి.. ప్రొమోతోనే ట్రెండింగ్ లో నిలిచిన ప్రభాస్.. ఇక ఫుల్ ఎపిసోడ్ తో ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తాడో..? ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్