Wednesday, June 10, 2026
Homeసినిమా‘బప్పి దా’తో గొప్ప అనుబంధం: చిరంజీవి

‘బప్పి దా’తో గొప్ప అనుబంధం: చిరంజీవి

Chiru Tributes: ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు బ‌ప్పీల‌హ‌రి ముంబైలోని ఓ హాస్ప‌ట‌ల్ లో క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 69 సంవ‌త్స‌రాలు. ఆయ‌న ఇక లేరు అనే వార్త తెలిసిప్ప‌టి నుంచి సినీ ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు త‌మ సంతాపాల‌ను వ్య‌క్తం చేస్తూ ఆయ‌న‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.
ఈ క్ర‌మంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ట్విట్ట‌ర్ లో సందిస్తూ… లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ బప్పీల‌హ‌రి చనిపోయారనే వార్త తెలియగానే షాక్ అయ్యాను. బప్పి దా తో నాకు చాలా మంచి అనుబంధం ఉంది.  నా సినీ ప్రయాణంలో ఆయ‌న ఎన్నో చార్ట్‌బ‌స్టర్స్‌ను అందించారు. నా జ‌ర్నీ గొప్ప‌గా ముందుకు సాగ‌డానికి అవి ఎంత‌గానో దోహ‌ద‌ప‌డ్డాయి. ఆయ‌న యూనిక్ స్టైల్‌ని, సినీ సంగీతంలో ఊర‌క‌లెత్తే ఆయ‌న ఉత్సాహాన్ని.. ఆయ‌న ప్ర‌దర్శించిన తీరుని.. ప్ర‌జ‌లు ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేరు. వ్య‌క్తిగ‌త జీవితాన్ని ఆయ‌న ఎంత‌గా ఎంజాయ్ చేశారో అది ఆయ‌న సంగీతంలో ప్ర‌తిబింబించింది. ఆయ‌న మ‌ర‌ణం ఇండ‌స్ట్రీకి తీర‌ని లోటు. ఆయ‌న కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితుల‌కు నా ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్నాను అన్నారు చిరంజీవి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular