Saturday, January 18, 2025
Homeసినిమాకైకాల‌ను కలిసిన చిరంజీవి దంప‌తులు

కైకాల‌ను కలిసిన చిరంజీవి దంప‌తులు

మెగాస్టార్ చిరంజీవి – న‌వ‌ర‌స‌ న‌ట‌నా సార్వ‌భౌమ కైకాల స‌త్య‌నారాయ‌ణ మ‌ధ్య అనుబంధం గురించి తెలిసిన‌దే. ఆ ఇద్ద‌రూ ఎన్నో క్లాసిక్ హిట్స్ లో క‌లిసి న‌టించారు.  య‌ముడికి మొగుడు, మెకానిక్ అల్లుడు, కొద‌మ సింహం, గ్యాంగ్ లీడ‌ర్, ఘ‌రానా మొగుడు, ఖైదీనంబ‌ర్ 786, .. ఇలా ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో క‌లిసి న‌టించారు. చిరంజీవి క‌థానాయకుడిగా కైకాల నిర్మాత‌గా కొన్ని సినిమాలు తెర‌కెక్కాయి. త‌న కెరీర్ ఆద్యంతం మెగాస్టార్ చిరంజీవితో జ‌ర్నీ సాగించాన‌ని వారికి తానంటే ఎంతో అభిమాన‌మ‌ని కైకాల చెబుతారు.

ఇక కైకాల స‌త్య‌నారాయ‌ణ అంటే తండ్రి స‌మానులుగా గౌర‌విస్తారు మెగాస్టార్ చిరంజీవి. ఆదివారం  కైకాల‌ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి – సురేఖ దంప‌తులు ఫిల్మ్ నగర్ లోని కైకాల సత్యనారాయణ ఇంటికి వెళ్లి పుష్ప‌గుచ్ఛం అందించి శుభాకాంక్ష‌లు తెలిపారు. కైకాల‌తో చాలా సేపు ముచ్చ‌ట్లాడారు. త‌మ కెరీర్ జ‌ర్నీలో ఎన్నో మెమ‌రీస్ ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకున్నారు.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..“తెలుగు సినిమా ఆణిముత్యం, నవరస నటనా సార్వభౌముడు, నాకు అత్యంత ఆప్తులు కైకాల సత్యనారాయణ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని,ఈ రోజు నేను, నా సతీమణితో కలిసి ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేసి కాసేపు ఆయనతో ముచ్చటించడం ఓ మధురమైన అనుభూతినిచ్చింది“ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్