Friday, April 19, 2024
Homeసినిమామంచిరోజులు వచ్చాయి క్యారెక్టర్స్ ఇంట్రో రిలీజ్..

మంచిరోజులు వచ్చాయి క్యారెక్టర్స్ ఇంట్రో రిలీజ్..

దర్శకుడు మారుతి తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం ‘మంచిరోజులు వచ్చాయి’. ‘ఏమ్ మినీ కథ’ ఫేమ్ సంతోష్ శోభన్, మెహ్రీన్ కౌర్ జంటగా నటించారు. రియల్ క్యారెక్టర్స్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇటీవల రిలీజ్ చేసిన ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ కి అనూహ్యమైన స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా  క్యారక్టర్స్ ఇంట్రో లుక్ ని విడుదల చేశారు. ఇందులో సంతోష్ శోభన్, మెహ్రీన్ తో పాటు కమెడియన్స్ వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్, సప్తగిరి, సుదర్శన్, వైవా హర్ష, సత్యం రాజేష్,  అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్ క్యారెక్టర్స్ ను పరిచయం చేశారు.

ఈ వీడియో.. అందులోని క్యారెక్టర్స్ చూస్తుంటే.. కరోనా టైమ్ లో జరిగిన సంఘటనలు ఆధారంగా తయారు చేసిన కథ అని తెలుస్తుంది. మీరు భయానికి భయపడి ఎంత దూరం పారిపోతే అది మీకు అంత దగ్గర అవుతుంది.. ఆయన మీకు అంత దూరం అవుతారు అని సంతోష్ శోభన్ చెప్పిన డైలాగ్, అలాగే సంతోష్ శోభన్ ని ఉద్దేశిస్తూ.. వైవా హర్ష చెప్పిన నువ్వు చేసిన రెండు సినిమాలకే ఇంత ఎక్సపీరియన్స్ ఏంటి బావా.. అనే డైలాగ్ బాగున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. మారుతి స్టైల్ కామెడీతో కడుపుబ్బా నవ్వుకోవచ్చు. థియేటర్లో నవ్వులే నవ్వులు అనేట్టుగా ఉంది. యు.వి కాన్సెప్ట్స్ మరియు మాస్ మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్