Wednesday, July 8, 2026
Homeసినిమా'భోళా శంకర్' అప్ డేట్ ఏంటి..?

‘భోళా శంకర్’ అప్ డేట్ ఏంటి..?

చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘భోళా శంకర్’. ఈ మూవీ టీజర్‌లో చిరు తన వింటేజ్ స్టైలిష్ మాస్ అవతార్‌లో కనిపించారు. భోళా శంకర్‌లో చిరంజీవి పవర్‌ప్యాక్‌తో కూడిన పాత్రను పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. “భోళా శంకర్ షూట్ పూర్తయింది. రాత్రి పగలు విరామం లేకుండా పని చేస్తున్న నటీనటులు & సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్‌తో జరుగుతున్నాయి. ప్రమోషన్స్ & పాటలు విడుదల కాబోతున్నాయి. భోళా శంకర్ ఆగస్టు 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల.  BholaaShankar @KChiruTweets ???????? ”అని మెహర్ రమేష్ ట్వీట్ చేశారు.

సినిమాలోని ఫస్ట్ సింగిల్ ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. మిగిలిన పాటలు ఒకదాని తర్వాత ఒకటి విడుదలౌతాయి. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ రామబ్రహ్మం సుంకర అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. డడ్లీ డీవోపీగా పని చేస్తున్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షణ చేయగా తిరుపతి మామిడాల డైలాగ్స్ అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత. భోళా శంకర్ ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular