Tuesday, June 16, 2026
Homeసినిమా'భోళాశంకర్' రియల్ టాక్ ఏంటి..?

‘భోళాశంకర్’ రియల్ టాక్ ఏంటి..?

చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘భోళాశంకర్’. మెహర్ రమేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. చిరుకు జంటగా తమన్నా నటిస్తే.. కీర్తి సురేష్ కు జంటగా సుశాంత్ నటించాడు. ఈ సినిమా వేదాళం రీమేక్. ఇది రీమేక్ మూవీ కావడం.. దీనికి ప్లాప్ డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకుడు కావడం వలనో ఏమో కానీ.. ఫస్ట్ నుంచి ఈ సినిమాకి బజ్ లేదు. ఓటీటీ రావడం వలన ఆడియన్స్ కి వరల్డ్ సినిమా అందుబాటులోకి వచ్చింది. అందుకనే రీమేక్ సినిమాలు తీస్తే.. కథ ముందే తెలిసిపోవడం వలన.. నటీనటులు, దర్శకనిర్మాతలు ఎంత ప్రయత్నం చేసినా.. ఎన్ని హంగులు అద్దినా ఆకట్టుకోలేకపోతున్నాయి.

భోళా శంకర్ విషయానికి వస్తే.. ఏదో పాత సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది కానీ.. ఎక్కడా కొత్తగా అనిపించలేదు. చిరంజీవి.. తమ్ముడు పవన్ కళ్యాణ్ ని ఇమిటేట్ చేసే సీన్స్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. ఇవి చేయకుండా ఉంటేనే బాగుండేది అనిపించింది. అయినా.. చిరంజీవిని ఎవరైనా అనుకరించాలి కానీ.. ఎంత తమ్ముడైనా పవన్ ని చిరు అనుకరించడం ఏంటి అనే మాట వినిపిస్తోంది. పాటలు బాగానే ఉన్నాయి.. డ్యాన్సులు బాగానే ఉన్నాయి కానీ.. కథ మాత్రం పాత కథ.

కథనంలో ఎక్కడా ఊహించని ట్విస్టులు కానీ.. వావ్ అనిపించే యాక్షన్ సీన్స్ కానీ లేవు. అందుచేత కామన్ ఆడియన్స్ కి కాస్త కష్టమే. మెగా అభిమానులు అయితే.. ఓసారి చూడచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే.. భోళాశంకర్.. బోరే జీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular