Wednesday, June 17, 2026
Homeసినిమానాగబాబు చేయాల్సిన కథతో చిరంజీవి సినిమా..?

నాగబాబు చేయాల్సిన కథతో చిరంజీవి సినిమా..?

మెగా బ్రదర్ నాగబాబు, తరుణ్ కాంబినేషన్లో ఓ సినిమా సెట్స్ పైకి రావాల్సింది కానీ.. కొన్ని కారణాల వలన ఆగిపోయిందట. ఈ చిత్రానికి వెలిగొండ శ్రీనివాస్ కథ అందించారు. ఇక కథ విషయానికి వస్తే… ఓ నాన్న తన కొడుక్కి పెళ్లి చేయాలి అనుకుంటే. కొడుకు ఏమో తండ్రికి పెళ్లి చేయాలి అనుకుంటాడు. ఇంచు మించు మా నాన్నకి పెళ్లి లాంటి కథ. అంతా సెట్ అయ్యింది పట్టాలెక్కస్తుంది అనుకున్న టైమ్ లో ఆగిపోయింది. ఇప్పుడు ఇలాంటి కథతోనే మెగాస్టార్ చిరంజీవి ఓ భారీ చిత్రం చేస్తుండడం విశేషం.

ఈ సినిమాలో చిరంజీవి నాన్న పాత్ర పోషిస్తుంటే.. కొడుకు పాత్రను సిద్దు జొన్నలగడ్డ పోషిస్తున్నారు. చిరంజీవికి జంటగా త్రిష నటిస్తుంటే.. సిద్ధుకు జంటగా శ్రీలీల నటిస్తుంది. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ కథ అందించారు. ఇది కూడా మా నాన్నకు పెళ్లి టైపు కథనే. ఇది చిరంజీవికి బాగా నచ్చిందట. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. మెగా డాటర్ సుస్మిత ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే.. వెలిగొండ శ్రీనివాస్ కథకు, బెజవాడ ప్రసన్న కథకు లింకు ఉందా..? అసలు ఈ కథ ఎలా పుట్టింది..? అనేది ఆ ఇద్దరు రచయితలే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular