Mega Hit: మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ఆచార్య. ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషించడం విశేషం. చిరు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తే.. చరణ్ సరసన పూజా హేగ్డే నటించింది. ఈ భారీ చిత్రం ఆచార్య ఈ నెల 29న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుకను అభిమానులు, సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ.. ఆచార్య చిత్రానికి కారణం రాజమౌళినే. రాజమౌళితో రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రం ఒకే అయింది. అదే సమయంలో రామ్ చరణ్ కోసం కొరటాల శివ కూడా కథ రెడీ చేసుకున్నారు. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తున్న తరుణంలో రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ పూర్తి చేసే లోపు నాతో ఒక సినిమా చేస్తావా అని అడిగాను. వెంటనే కొరటాల సంతోషంతో ఆచార్య కథ రెడీ చేశారు. ఈ కథలో సిద్ద పాత్ర కోసం రామ్ చరణ్ ని అనుకోవడంతో మళ్లీ సమస్య మొదటికి వచ్చింది. దీనితో రాజమౌళిని రిక్వస్ట్ చేశాను. రాజమౌళి అవకాశం ఉన్నప్పుడల్లా ఆర్ఆర్ఆర్ నుంచి చరణ్ ని రిలీజ్ చేస్తూ వచ్చాడు. ఆ గ్యాప్ లో చరణ్ పాత్రని ఫినిష్ చేశాం. పాండమిక్ వల్ల అన్ని సినిమాలు ఇబ్బంది పడినప్పటికీ.. రాజమౌళి ఇచ్చిన మాట తప్పలేదు. ఇక్కడో విషయం చెప్పాలి… రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఆ హీరో నటించిన నెక్ట్స్ మూవీ సక్సెస్ అవ్వడం లేదు. ఇది సెంటిమెంట్ గా మారిందని కొందరు అంటుంటారు. అలాంటిది ఏమీ లేదు. కథ పై సరిగా వర్క్ చేయకపోవడం వలన అలా జరిగి ఉంటుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నటించిన ఈ సినిమా ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తుంది. ఆచార్య ఖచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది” అంటూ అభిమానులకు భరోసా ఇచ్చారు.