Tuesday, March 19, 2024
HomeTrending Newsమతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం

మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం

ప్రజలారా… బాంచన్ బతుకులు కావాలా? …. పేదల రాజ్యం కావాలా? ఆలోచించుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మోసకారి. పచ్చి అబద్దాలు కోరు. అవినీతి పరుడు. ఇలాంటి వ్యక్తి ప్రపంచంలోనే మరొకరు లేరని అన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చి మాట తప్పిన కేసీఆర్ తన కుటుంబంలో మాత్రం 5 గురికి ఉద్యోగాలిచ్చుకుని నెలకు రూ.25 లక్షల జీతం సంపాదించుకుంటున్నారని అన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ 11వ రోజు నర్వ మండలంలో పాదయాత్ర చేశారు.

ఈ సందర్భంగా నర్వ కేంద్రంలో ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు. అందులోని ముఖ్యాంశాలు….

కేసీఆర్ పెద్ద మోసకారి… కేసీఆర్ అంటే కోతల చంద్రశేఖర్ రావు. ఆయన మాటలు నమ్మి ప్రజలు బాగా నష్టపోయారు. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడుతాయనుకుంటే మరింత దిగజారిపోయాయి. కేసీఆర్ మాదిరిగా మోసాలు, దుర్మార్గాలు చేయాలంటే భయపడాలె’’అని అన్నారు. బీజేపీ మత పరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకమని బండి సంజయ్ మరోసారి పునరుద్ఘాటించారు. ‘‘మేం మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకం. ఇందులో మరో మాట లేనేలేదు. అయితే కేంద్రం వద్దన్నా రాష్ట్రంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు కదా… అది సాధ్యమైనప్పుడు వాల్మికీ బోయలను ఎస్టీ జాబితాలో ఎందుకు చేర్చడు? ఎందుకంటే కేసీఆర్ కు చిత్తశుద్ధి లేనేలేదు. ’’అని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 70 స్థానాల్లో బీసీలు, హిందువులు గెలిచే అవకాశమున్నా అక్కడ ఎంఐఎం గెలుస్తోందని… కేసీఆర్ లాంటి వ్యక్తులు ఎంఐఎంతో కుమ్కక్కవడంవల్లే బీసీలకు, హిందువులకు అన్యాయం జరుగుతోందని అన్నారు.
.
నర్వ మండలంలో మూడు రిజర్వాయర్లున్నయ్. కానీ నీళ్లు మాత్రం రావడం లేదు. కేసీఆర్ కు ఫాంహౌజ్ కట్టుకోవడానికి 2, 3 వందల ఎకరాలిస్తే… ఆయన కోసం నీళ్లు తెచ్చుకుంటడు.. మీకూ అక్కడక్కడా నీళ్లిస్తరు. లేకుంటే రావు. ఎందుకంటే గజ్వేల్ లో కేసీఆర్ ఫాంహౌజ్ కు నీళ్లు తెచ్చుకోవడానికి లక్షా 20 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి గోదావరి నుండి నీళ్లు తెచ్చుకుండు. ఇక్కడ 3, 4 వందల కోట్లు ఖర్చు చేస్తే ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకురావొచ్చు. కానీ కేసీఆర్ కు ఇక్కడి ప్రజలకు నీళ్లించేందుకు మనసు రాదు.

కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ తో మాట్లాడి ఆర్డీఎస్ సమస్యకు పరిష్కారం చూపినం. రాష్ట్రం సహకరిస్తే 6 నెలలో నీళ్లు తీసుకురావొచ్చు. కేంద్రం నిధులిస్తే … కేసీఆర్ దారి మళ్లించిండు. వ్యాక్సిన్ ను ఉచితంగా మోదీ అందించడంవల్లే ఈరోజు అందరం కలిసి మాట్లాడుకోగలుతున్నాం. దళితులకు మూడెకరాలు ఇవ్వలేదు. దళిత బంధు ఇవ్వలేదు. ఈ రెండూ అమలు చేస్తే దళితులు కోటీశ్వరులు అయ్యేవారు. కేవలం మాటలే తప్ప చేతల్లేవ్. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. గడీల రాజ్యం పోవాలి. గరీబోళ్ల ప్రభుత్వం రావాలి.

Also Read : కేసీఆర్ పాలన పోవడం- బిజెపి రావడం ఖాయం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్