Sunday, January 19, 2025
Homeసినిమాసంక్రాంతికి 'మెగా154' గ్రాండ్ రిలీజ్

సంక్రాంతికి ‘మెగా154’ గ్రాండ్ రిలీజ్

Release Day: మెగాస్టార్ చిరంజీవి, టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ (కెఎస్ రవీంద్ర), మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్‌ల క్రేజీ కాంబినేషన్‌ లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ మెగా154 థియేట్రికల్ విడుదల తేదీ ఖరారైయింది. మెగా అభిమానులకు, సినీ ప్రేక్షకులకు మెగా అప్‌డేట్ చ్చింది చిత్ర యూనిట్. 2023 సంక్రాంతికి మెగా154 థియేటర్ లో పూనకాలు సృష్టించడానికి సిద్ధమయ్యింది. “కలుద్దాం… సంక్రాంతికి జనవరి 2023,” అని పోస్టర్ ద్వారా నిర్మాతలు మెగా రిలీజ్ ని ప్రకటించారు. రిలీజ్ డేట్ పోస్టర్ మెగాస్టార్ చిరంజీవి పోస్టర్‌లో చేతిలో లంగరుని పట్టుకుని, బ్యాక్‌గ్రౌండ్‌లో సముద్రం, పడవలు కనిపించడం మెగా వైబ్రెంట్ గా వుంది. ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ టైటిల్, టీజర్ త్వరలో వెల్లడించనున్నారు.

మెగా154 ప్రస్తుతం 40% చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ వచ్చే నెల నుండి ప్రారంభమవుతుంది, గడువులోగా పూర్తి చేయడానికి నాన్‌స్టాప్‌గా షూట్ చేయనున్నారు. మెగా154 బాబీ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోంది. తన ఆరాధ్యదైవం మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయడంతో బాబీ కల నిజమైనట్లయింది. మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని అయిన బాబీ మునుపెన్నడూ చూడని మాస్-అప్పీలింగ్ , పవర్-ప్యాక్ పాత్రలో మెగాస్టార్ ని చూపించబోతున్నారు.

అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసనశృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జికె మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మెగా 154కోసం ప్రముఖ నటులు, అత్యున్నత స్థాయి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవికి అనేక చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లను అందించిన రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మెగా 154కి సంగీతం అందించగా, ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నిరంజన్‌ దేవరమానె ఎడిటర్‌గా, ఎఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్. ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు.

Also Read : ‘మెగా154’ సెట్స్‌ను సందర్శించిన సుకుమార్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్