Saturday, June 27, 2026
Homeసినిమా'మెగా154' సెట్స్‌ను సందర్శించిన సుకుమార్

‘మెగా154’ సెట్స్‌ను సందర్శించిన సుకుమార్

Visit: మెగాస్టార్ చిరంజీవి, బాబీ, మైత్రీ మూవీ మేకర్స్ సెన్సేషనల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న మెగా154 చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తాజా  షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. చిరంజీవి, శృతి హాసన్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. సినిమాలోని ప్రధాన తారాగణం పై చిత్ర బృందం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. దర్శకుడు సుకుమార్  సెట్స్‌ని సందర్శించారు.

సుకుమార్ సెట్స్ లో వున్న ఫోటోని అభిమానులతో పంచుకుకుంది చిత్ర యూనిట్. బాబీ, సుకుమార్‌ కి లాప్ టాప్ లో ఏదో చూపించడం, సుకుమార్ ఆసక్తికరంగా చూడటంలో ఈ చిత్రంలో గమనించవచ్చు. మెగా154 బాబీ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోంది. తన ఆరాధ్యదైవం మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయడంతో బాబీ కల నిజమైనట్లయింది. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. మెగాస్టార్‌తో శృతి హాసన్‌ ఈ చిత్రం కోసం తొలిసారి జతకట్టారు.

నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జికె మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవికి అనేక చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లను అందించిన రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మెగా 154కి సంగీతం, ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నిరంజన్‌ దేవరమానె ఎడిటర్‌గా, ఎఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్. ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు.

Also Read హైదరాబాద్ లో మెగా 154 భారీ యాక్షన్ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular