Friday, March 29, 2024
Homeసినిమాహైదరాబాద్ లో మెగా 154 భారీ యాక్షన్

హైదరాబాద్ లో మెగా 154 భారీ యాక్షన్

Mega 154: మెగాస్టార్ చిరంజీవి, టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వం లో మెగా 154 (వర్కింగ్ టైటిల్) లో నటిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రానికి సంబందించిన హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ ని హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో షూట్ చేస్తున్నారు. చిత్ర యూనిట్ ఈ షెడ్యూల్ లో మెగాస్టార్ చిరంజీవి, ఫైటర్స్ తో ఉత్కంఠభరితమైన యాక్షన్ ఎపిసోడ్ ని ఫైట్ మాస్టర్స్ ద్వయం రామ్ లక్ష్మణ్ సారథ్యంలో చిత్రీకరిస్తున్నారు. ఇది అభిమానులకి, మాస్ ఆడియన్స్ కి ఒక కిక్ ఇచ్చే లా ఉండబోతుంది. హీరోయిన్ శృతి హాసన్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు.

ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటుంది. ఇందులో కమర్షియల్ అంశాలు సమపాళ్లలో ఉంటూ వింటేజ్ చిరంజీవిని మళ్ళీ స్క్రీన్ మీదకి తీసుకువచ్చేలాగా దర్శకుడు బాబీ  సినిమాను సిద్ధం చేస్తున్నారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జి కె మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం అగ్రశ్రేణి సాంకేతిక బృందం సహకరిస్తోంది. అయితే.. పలువురు ప్రముఖ నటీనటులు ఇందులో భాగమయ్యారు. మెగా154 కి చిరంజీవి కి అనేక చార్ట్ బస్టర్ ఆల్బమ్ లను అందించిన రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఎడిటర్ గా నిరంజన్ దేవరమానె, ప్రొడక్షన్ డిజైనర్ గా ఎఎస్ ప్రకాష్ పని చేస్తున్నారు. సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్. బాబీ స్వయంగా కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్ ప్లే రాశారు. రైటింగ్ డిపార్ట్మెంట్ లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్