Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Chaitu next: అక్కినేని నాగ‌చైత‌న్య న‌టించిన తాజా చిత్రం థ్యాంక్యూ. ఈ చిత్రానికి మ‌నం ఫేమ్ విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై టాలీవుడ్ టాప్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. ఇక ఈ మధ్యే నాగ చైతన్య ఆ దర్శకుడితోనే ‘దూత’ అనే వెబ్ సిరీస్ ను కూడా స్టార్ట్ చేశాడు. ఈ రెండు ప్రాజెక్టుల అనంతరం నాగ చైతన్య చేయనున్న సినిమా గురించి అప్ డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

కోలీవుడ్ డైరెక్ట‌ర్ వెంకట్ ప్రభు తన నెక్స్ట్ మూవీ నాగ చైతన్యతో ఉంటుందని ఇటీవ‌ల ఓ ఇంట‌ర్ వ్యూలో తెలియ‌చేశారు. ఇది స్ట్రెయిట్ తెలుగు సినిమా కావడం విశేషం. 90వ దశకం నేపథ్యంలో సాగే ద్విభాషా చిత్రంగా ఈ ప్రాజెక్ట్ రూపొందనుందని వెంకట్ ప్రభు తెలిపారు. ఇంకా అధికారికంగా ప్రకటించని ఈ సినిమాలో నాగ‌చైత‌న్య స‌ర‌స‌న క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే కనిపించనుందని సమాచారం. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు ప్ర‌క‌టించ‌నున్నారు.

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com