Friday, April 19, 2024
HomeTrending Newsయాదాద్రి మహాకుంభ సంప్రోక్షణకు సిఎం

యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణకు సిఎం

Yadaadri: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం మహా కుంభ సంప్రోక్షణ సోమవారం మార్చి 28 న జరగనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీయార్ దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ నెల 21న ఈ మహా కుభ సంప్రోక్షణ కార్యక్రమాలకు అంకురార్పణ చేశారు. నేడు పూర్ణాహుతి కార్యక్రమంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. రేపటి నుంచే ఆలయం పునఃప్రారంభం కానుంది.

ఇప్పటివరకూ బాలాలయంలో ఉంచిన మూలవరులను ప్రధాన దేవాలయంలోకి ప్రతిష్టింపజేయనున్నారు. ఉదయం 11.55 గంటలకు పుష్కరాంశ శుభలగ్నంలో ముఖ్యమంత్రి దంపతులు స్వామివారికి తొలి పూజ చేయనున్నారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రధాన ఆయలంలోకి సాధారణ భక్తులను అనుమతించనున్నారు.

ముఖ్యమంత్రి కెసియార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మించడమే కాకుండా యాదగిరి గుట్ట పరిసర ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేశారు.

చుట్టుపక్కల ప్రాంతమంతా పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలతో విరాజిల్లబోతోంది. తెలంగాణ రాష్ట్రానికి ఓ గొప్ప  ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి నిర్మాణం కోట్లాది ప్రజల భక్తి భావానికి ప్రతీకగా నిలిచి, దేశంలోనే ఓ గొప్ప పుణ్యక్షేత్రంగా విరాజిల్లబోతోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్