Saturday, April 20, 2024
Homeస్పోర్ట్స్నాలుగో మ్యాచ్ లో ఇండియా ఘన విజయం

నాలుగో మ్యాచ్ లో ఇండియా ఘన విజయం

Bowlers show: సౌతాఫ్రికాతో జరుగుతోన్న టి20 సిరీస్ లో భాగంగా నేడు జరిగిన నాలుగో మ్యాచ్ లో ఇండియా 82 పరుగులతో ఘనవిజయం సాధించింది. ఇండియా బౌలర్లు అద్భుతంగా రాణించడంతో 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 87 పరుగులకే కుప్పకూలింది.

రాజ్ కోట్ లోని సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రుతురాజ్ గైక్వాడ్ మరోసారి విఫలమై 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. శ్రేయాస్ అయ్యర్ కూడా కేవలం నాలుగు పరుగులే చేశాడు, ఇషాన్ కిషన్ 27 స్కోరు చేసి అవుట్ కాగా, కెప్టెన్ పంత్, హార్దిక్ పాండ్యా లు నాలుగో వికెట్ కు 40 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పంత్ 17 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ దశలో పాండ్యా- దినేష్ కార్తీక్ లు ఐదో వికెట్ కు 65 పరుగుల చక్కని భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. పాండ్యా 31 బంతుల్లో 3 ఫోర్లు,  3 సిక్సర్లతో 46; దినేష్ 27 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేసి ఔటయ్యారు. నిర్ణీత 20ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో నిగిడి రెండు; మార్కో జాన్సెన్, ప్రెటోరియస్, నార్త్జ్, కేశవ్ మహారాజ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా, జట్టు స్కోరు 20 వద్ద 8 పరుగులు చేసిన కెప్టెన్ బావుమా గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగారు. ఆ తర్వాత కాసేపటికే డికాక్ రనౌట్ గా వెనుదిరిగాడు, వెంటనే ప్రెటోరియస్ కూడా డకౌట్ అయ్యాడు. వాన్ దర్ డస్సెన్ 20 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. జట్టులో డస్సెన్-20;  డికాక్-14; మార్కో జాన్సెన్-11 మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. 16.5 ఓవర్లలో 87 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

ఇండియా బౌలర్లలో అవేష్ ఖాన్ నాలుగు, చాహల్ రెండు, హర్షల్ పటేల్, అక్షర్ పటేల్ చెరో వికెట్ పడగొట్టారు.

దినేష్ కార్తీక్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.

దీనితో ఐదు మ్యాచ్ ల సిరీస్ 2-2 తో సమం అయ్యింది. చివరి మ్యాచ్ బెంగుళూరులో ఆదివారం జూన్ 19 న జరగనుంది.

Also Read :  ఐర్లాండ్ తో సిరీస్ కు హార్దిక్ సారధ్యం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్