Sunday, January 19, 2025
Homeసినిమాచిరు - బాబీ మూవీకి ముహుర్తం ఫిక్స్

చిరు – బాబీ మూవీకి ముహుర్తం ఫిక్స్

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చిరు గాడ్ ఫాదర్ మూవీ చేస్తున్నారు. దీనికి మోహన్ రాజా దర్శకుడు. ఇక చిరు 154వ చిత్రాన్ని బాబీ డైరెక్షన్ లో చేయనున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ లో చిరంజీవి ఊర మాస్ లుక్ లో కనిపించారు. దీంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే.. ఈ సినిమా ప్రారంభోత్సవానికి నవంబర్ 6న ముహూర్తం ఫిక్స్ చేసారని ఓ ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌ బయటకు వచ్చింది.

దీనికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నారని సమాచారం. ఇక టైటిల్ విషయానికి వస్తే.. వాల్తేరు వీరయ్య, వాల్తేరు వీర్రాజు అనే టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. ఈ రెండు టైటిల్స్ లో ఏ టైటిల్ ను ఫిక్స్ చేశారు అనేది తెలియాల్సివుంది. మెగాస్టార్ రీఎంట్రీ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళుతున్నారు. ఓ వైపు ఆచార్య రిలీజ్ కి రెడీగా ఉంది. మరో వైపు గాడ్ ఫాదర్ సెట్స్ పై ఉంది. ఇప్పుడు బాబీతో సినిమాని స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ విధంగా మెగాస్టార్ యంగ్ హీరోలకు పోటీగా వరుసగా సినిమాలు చేస్తుండడం విశేషం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్