Saturday, January 18, 2025
Homeసినిమానవంబర్ 6న  చిరు-బాబీ చిత్రం ప్రారంభం

నవంబర్ 6న  చిరు-బాబీ చిత్రం ప్రారంభం

Chiru Bobby Movie Will Be Launching On November 6th  :

మెగాస్టార్ చిరంజీవితో దర్శకుడు బాబీ రూపొందిచబోతోన్న సినిమా ముహూర్తం ఖరారైంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినమాకు  జీకే  మోహన్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.

ఈ సినిమా ముహూర్తం నవంబర్ 6, శనివారం ఉదయం 11.43 గంటలకు జరగనుంది, 12.06 నిమిషాలకు ‘మెగా స్టార్ మాస్ మూల విరాట్ దర్శనం’ పేరుతో చిరంజీవి పోస్టర్ ను ఆవిష్కరించనున్నారు. నేడు దీపావళి సందర్భంగా దర్శక నిర్మాతలు ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

కాగా, చిరంజీవి వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నారు. అయన తాజా చిత్రం ‘ఆచార్య’ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని ఫిబ్రవరి 4న విడుదల కానుంది. ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో  ‘లూసిఫర్’ రీమక్
‘గాడ్ ఫాదర్’ లో నటిస్తున్నారు, ఈ సినిమాను ఎన్వీఆర్ సినేమాస్ ఎల్ ఎల్ పి, కొణిదల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.

దీనితో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ సినిమాలో కూడా చిరు నటిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీనికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. అన్నాచెల్లెల సెంటిమెంట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తోంది. నవంబర్ 11వ తేదీ ఉదయం 7:45 గంటలకు ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది. రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 15 నుండి మొదలవుతుంది.

ఇలా చిరు ఒక సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా, మరో మూడు కొత్త ప్రాజెక్టుల్లో వెంట వెంట నటిస్తూ మెగాభిమానులకు కనువిందు చేయనున్నారు.

Must Read : చిరు పొగడ్తలతో పొంగిపోతున్న సాయిపల్లవి

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్