Saturday, June 13, 2026
Homeసినిమాచిరు పొగడ్తలతో పొంగిపోతున్న సాయిపల్లవి

చిరు పొగడ్తలతో పొంగిపోతున్న సాయిపల్లవి

నాగచైతన్య – సాయిపల్లవి జంటగా నటించిన విభిన్న ప్రేమకథా చిత్రం లవ్ స్టోరీ. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా సందడిగా జరిగింది. ఈ వేడుకలో స్టేజ్ పై చిరు, సాయిపల్లవి డ్యాన్స్ చేయడం ఈవెంట్ కు హైలైట్ గా నిలిచింది. ఈ వేడుకలో హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ “చిరంజీవి గారి సినిమాల్లో డాన్సులు చూసీ చూసీ నాకు అదే గ్రేస్ అలవాటు అయ్యింది. ఆయన నా డాన్సింగ్ టాలెంట్ గురించి చెప్పడం చాలా సంతోషంగా ఉంది. అమీర్ ఖాన్ గారు నా సినిమా ఈవెంట్ కు వస్తారని కలలో కూడా అనుకోలేదు కానీ.. ఇవాళ అది నిజం కావడం నమ్మలేకపోతున్నాను. అమీర్ ఖాన్ గారు ఎప్పుడూ మమ్మల్ని ఇన్ స్పైర్ చేస్తుంటారు. నేను విభిన్నమైన క్యారెక్టర్ కు న్యాయం చేయగలను అని దర్శకుడు శేఖర్ కమ్ముల గారు నమ్మడమే పెద్ద బ్లెస్సింగ్ అని అనుకుంటున్నాను”

“ఆయన డైరెక్షన్ లో నాకిది రెండో సినిమా. ఒక్కసారి శేఖర్ కమ్ముల గారి సినిమా సెట్ కు వెళ్తే ఎంత వినయంగా పని చేయాలో, ఎంత ఒద్దికగా ఉండాలో తెలుస్తుంది. అదే ఎనర్జీతో నేను మిగతా చిత్రాల సెట్స్ కు వెళ్తుంటాను. ఈ టీమ్ తో మరో సినిమా వెంటనే చేయాలని కోరుకుంటున్నాను. నాగ చైతన్య వండర్ ఫుల్ కో స్టార్. ఆయనతో నటించడం ఎంతో సంతోషంగా ఉంది. శేఖర్ గారి చిత్రాల్లో సమాజానికి చెప్పేందుకు ఏదో ఒక విషయం ఉంటుంది. అలాగే ఇందులో అమ్మాయిలు చూసి తెలుసుకునేందుకు ఒక ముఖ్యమైన విషయం ఉంది. వాళ్లంతా లవ్ స్టోరి చూశాక, ఒక ఆలోచనతో ఇంటికి వెళ్తారు. మిమ్మల్ని మీరు వేసుకునే ఒక ప్రశ్నతో ఇంటికి వెళ్తారు” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular