Saturday, April 20, 2024
Homeసినిమాచిరంజీవి గాడ్ ఫాద‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స్?

చిరంజీవి గాడ్ ఫాద‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స్?

Soon: మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా న‌టిస్తోన్న తాజా చిత్రం గాడ్ ఫాదర్. ఈ చిత్రానికి మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మ‌ల‌యాళంలో విజ‌యం సాధించిన లూసీఫ‌ర్ మూవీకి ఇది రీమేక్. ఇందులో న‌య‌న‌తార, స‌త్య‌దేవ్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇందులో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ గెస్ట్ రోల్ చేస్తుండ‌డం విశేషం. ఇటీవ‌ల చిరంజీవి, పూరి జ‌గ‌న్నాథ్ ల పై కొన్ని సీన్స్ ను చిత్రీక‌రించారు.

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ కూడా న‌టిస్తున్నారు. అంతే కాకుండా.. చిరు, స‌ల్మాన్ క‌లిసి స్టెప్పులు వేయ‌నున్నార‌ని.. ఈ సాంగ్ కోసం సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ అదిరిపోయే ట్యూన్ రెడీ చేశార‌ని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా గురించి తాజా అప్ డేట్ ఏంటంటే.. ఈ సినిమాను ఆగస్టు 12వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది.

కంటెంట్ పరంగా ఈ సినిమా ఆగస్టు 15 నాటికి థియేటర్లలో ఉండేలా చూడాలని భావించారట. అందువల్లనే ఆగస్టు 12వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టుగా సమాచారం. అదే రోజున సమంత య‌శోద‌, నితిన్ మాచెర్ల నియోజ‌క‌వ‌ర్గం సినిమాలు బరిలో ఉండటం విశేషం. అయితే… ప్ర‌చారంలో ఉన్న‌ట్టుగా గాడ్ ఫాద‌ర్ మూవీని ఆగ‌ష్టు 12నే విడుద‌ల చేస్తారా..?  లేక వేరే డేట్ చూస్తారా..?  అనేది తెలియాల్సివుంది.

Also Read :‘గాడ్ ఫాదర్’ కోసం ఇండియన్ మైకేల్ జాక్సన్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్