Saturday, January 18, 2025
Homeసినిమాకష్టాన్ని నమ్ముకుని పని చేయాలి : చిరంజీవి

కష్టాన్ని నమ్ముకుని పని చేయాలి : చిరంజీవి

Chiru Launched The First Look Title Of Kotis Son Rajiv Movie :

టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వస్తిక ఫిలిమ్స్ సంయుక్తంగా సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరి హీరోగా, వాణి విశ్వనాథ్ కూతురు వర్ష విశ్వనాథ్ హీరోయిన్ గా, సదన్, లావణ్య, రాజా రవీంద్ర, రాజాశ్రీ నటీనటులుగా కిట్టు నల్లూరి దర్శకత్వంలో గాజుల వీరేష్ (బళ్లారి) నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1’  “11:11” ఈ చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్ విడుదల హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో గ్రాండ్ గా జరిగింది. ముఖ్య అతిధిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి టైటిల్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

అనంతరం మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ఈ రోజు చాలా మంచి రోజు. నా మరో సినిమా ‘భోళా శంకర్’ కూడా ఈ రోజే ప్రారంభమైంది. నిన్న అర్ధ రాత్రి వరకు కూడా నేను కోటి గారి ఇంట్లోనే షూటింగ్ చేయడం జరిగింది. అయినా కూడా ఈ కార్యక్రమానికి రావడానికి ప్రధాన కారణం కోటి గారు. ఎందుకంటే కోటితో నాకున్న అనుబంధం అంతా ఇంతా కాదు. నా సినిమా అనేసరికి ప్రత్యేకించి అన్ని రకాల హంగులతో ఆయన ఎంతో ప్రత్యేకమైన శ్రద్ద తీసుకొని సంగీతం అందించేవారు. ముఖ్యంగా చెప్పాలంటే… నా విజయానికి, నా ఎదుగుదలకి సింహభాగం రాజ్ – కోటి లదే అని చెప్పాలి. ఇద్దరు కూడా నా సినిమాకు సంబంధించిన సాంగ్స్ ను ప్రత్యేకంగా 80, 90 దశకంలో హిట్లర్, రిక్షావోడు, లాంటి సినిమాలు 12 వరకు చేయడం జరిగింది. సుమారు 60 సాంగ్స్ అంటే నాకు 90% సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చాడు.

ఇంత మంచి హిట్ సాంగ్స్ ఇచ్చినటువంటి కోటి గారి రుణం తీర్చుకోలేక పోయానే అనే బాధ ఉండేది. కానీ ఈ రోజు కోటి గారి కొడుకు రాజీవ్ ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషం వేసింది. సాలూరు రాజేశ్వరరావు గారు ఎంతో గొప్ప లెజెండరీ సంగీత దర్శకుడు. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని కోటి గారు కూడా సంగీతంలో తండ్రికి తగ్గ తనయుడిగా రెండు దశాబ్దాల పాటు అద్భుతమైన సంగీతాన్ని ప్రేక్షకులకు అందించాడు. ఈ రోజుకి కూడా తనంటే నాకు ఇన్స్పిరేషన్. చాలా మంది తెరమరు గవుతున్నా..తను మాత్రం  బుల్లితెర పై కూడా తన ప్రస్థానాన్ని మళ్ళీ కొనసాగిస్తూ.. కాంటెంపరరీ గా ఉంటూ ఔత్సాహికులను ఉత్సాహపరుస్తూ తను మంచి మనసుతో ముందుకు వెళ్తున్నారు.

అతనిలో ఉన్న పాజిటివ్ నెస్ తనని ముందుకు నడిపిస్తుంది. తన ఇద్దరు కొడుకుల్లో ఒకరిని సంగీత దర్శకుడిగా,  మరొకరిని నటుడుగా పరిచయం చేసి ఇండస్ట్రీలో ఇరువైపులా ఉండేలా తను ప్లాన్ చేసుకున్నాడు. ఈనాడు సినిమా ఇండస్ట్రీ వండర్ఫుల్ ఇండస్ట్రీ…. కొత్త వాళ్లు ఇండస్ట్రీకి వస్తానంటే నేను గ్రాండ్ గా వెల్ కమ్ చెప్తాను. సినీ కళామతల్లిని నమ్ముకున్న వారు ఎవ్వరు కూడా చెడిపోలేదు. వచ్చిన వారంతా కూడా మొదటగా కష్టాన్ని నమ్ముకుని పని చేస్తూ నిజాయితీగా ఉండాలి. అలా ఉన్నవారికి ఖచ్చితంగా అవకాశం లభిస్తుంది. అలా నేను కూడా కష్టపడుతూ రావడం వలనే ఈ రోజు ఈ స్థాయికి రావడం జరిగింది. ఇండస్ట్రీలో జయాపజయాలు అనేవి సహజం. వాటిని పక్కన పెట్టి మన కష్టాన్ని నమ్ముకొని సిన్సియర్ గా పనిచేస్తే కచ్చితంగా అద్భుతమైన విజయాలను సాధిస్తారు.

సినీ ఇండస్ట్రీకు కొత్త తరం రావాలి. వచ్చి ఇండస్ట్రీలో మాలాంటి పెద్దల ఎక్స్పీరియన్స్ తో సలహాలు తీసుకోవాలి. ఇండస్ట్రీ ఎప్పుడూ ఫ్రెష్ గా సాగిపోవాలని కోరుకుంటున్నాను. అలాగే రాజీవ్ కు కూడా ఈ సినిమా మంచి బ్రేక్ నివ్వాలి. అలాగే రాజ్ గారి అబ్బాయి సాగర్ కు కూడా ఈ సినిమా లో అవకాశం కల్పించడం జరిగింది. సాగర్ కూడా తండ్రిని మించిన తనయుడు కావాలని కోరుకుంటున్నాను. చిత్ర నిర్మాత కూడా లాభాపేక్ష లేకుండా ఫ్యాషన్ తో ఇండస్ట్రీకు రావడం చాలా గ్రేట్ నెస్. వారి కోరిక ప్రకారం ఈ సినిమాతో పాటు తను పెట్టిన టైగర్ హిల్స్ ప్రొడక్షన్ కూడా గొప్ప విజయం సాధించి ఎన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. దర్శకుడు కిట్టు గారికి , హీరోయిన్ వర్ష లకు ఈ సినిమా ద్వారా గొప్ప సక్సెస్  రావాలని మనస్ఫూర్తిగా కోరుతూ చిత్ర యూనిట్ అందరికీ ఆల్ ద బెస్ట్” అన్నారు.

Also Read :  సాలూరి రాజీవ్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్న చిరంజీవి

RELATED ARTICLES

Most Popular

న్యూస్