Thursday, April 25, 2024
Homeసినిమాసాలూరి రాజీవ్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్న చిరంజీవి

సాలూరి రాజీవ్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్న చిరంజీవి

Mega Star Chiru  Launch First Look Poster  Kotis Son Movie :

సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరి హీరోగా టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వస్తిక ఫిలిమ్స్ కలిసి  ‘ప్రొడక్షన్ నెంబర్ 1’గా ఓ కొత్త సినిమా నిర్మిస్తున్నారు. కిట్టు నల్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు గాజుల వీరేష్ (బళ్లారి) నిర్మాతగా వ్యవహరిస్తుండగా, వర్ష విశ్వనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో కోటి ఓ ముఖ్య పాత్ర పోషిస్తుండటం విశేషం. సదన్, లావన్య, రాజా రవీంద్ర, రాజాశ్రీ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఓ సరికొత్త కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మెగా సపోర్ట్ లభించింది. ఈ మూవీ ఫస్ట్ లుక్ ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేయనున్నారు. నవంబర్ 11వ తేదీ సాయంత్రం 6 గంటలకు గ్రాండ్‌గా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

ఈ సినిమాకు సంగీత దిగ్గజం మణిశర్మ అందిస్తున్న బాణీలు  అదనపు ఆకర్షణ అని దర్శకనిర్మాతలు వెల్లడించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని, రాజీవ్ నటన హైలైట్ కానుందని నిర్మాత గాజుల వీరేష్ చెప్పారు. ఈశ్వర్ సినిమాటోగ్రఫీ, పవన్ కె అచల మాటలు అందిస్తున్నారు. విష్ణుసూర్య గుంత ఎక్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించనున్నారు.

Also read : నాకు ఎమోషనల్ గా  అనిపిస్తోంది: మెగాస్టార్ చిరంజీవి

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్