Friday, May 31, 2024
Homeసినిమానాకు ఎమోషనల్ గా  అనిపిస్తోంది: మెగాస్టార్ చిరంజీవి

నాకు ఎమోషనల్ గా  అనిపిస్తోంది: మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ‘రిప‌బ్లిక్‌’ ట్రైల‌ర్ విడుద‌లైంది. సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా న‌టించిన ఈ పొలిటికల్ థ్రిల్ల‌ర్‌ను దేవ క‌ట్టా డైరెక్ట్ చేశారు. జీ స్టూడియోస్‌ సమర్పణలో జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకం పై జె.భగవాన్, జె.పుల్లారావు ఈ సినిమాను నిర్మించారు. సెన్సార్ స‌హా అన్ని కార్యక్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ‘రిప‌బ్లిక్‌’ గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 1న విడుద‌ల‌వుతుంది.

ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ… ‘‘సాయిధరమ్ తేజ్ ఆ భ‌గ‌వంతుడు దీవెన‌ల‌తో, ప్రేక్ష‌కాభిమానులందరి ఆశీస్సుల‌తో హాస్పిట‌ల్‌లో త్వ‌ర‌గా కోలుకుంటున్నాడు. త‌న హీరోగా చేసిన రిప‌బ్లిక్ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌డం కాస్త ఎమోష‌న‌ల్‌, హెవీగా అనిపిస్తుంది. త్వ‌ర‌లోనే సాయితేజ్ మ‌న మ‌ధ్య‌కు వ‌స్తాడు. ఇక దేవ క‌ట్టా గారు డైరెక్ష‌న్ చేసిన ఈ సినిమా ట్రైల‌ర్ చూస్తుంటే నాకు రోమాలు నిక్కబోడుచు కుంటున్నాయి. ఓ యంగ్ క‌లెక్ట‌ర్ రౌడీయిజాన్ని అరిక‌ట్ట‌డానికి ప్ర‌య‌త్నం చేయ‌డం, ప్ర‌జ‌ల‌కు ఎలాంటి రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ను ఎన్నుకోవాలో తెలియ‌జేప్పే ప్ర‌య‌త్నం చూస్తుంటే అంద‌రినీ ఎడ్యుకేట్ చేస్తున్న సినిమాలా అనిపిస్తుంది”

“సాయితేజ్ డైన‌మిక్‌గా క‌నిపిస్తున్నాడు. క‌మ‌ర్షియ‌ల్‌గా సినిమా అంద‌రినీ మెప్పిస్తుంద‌ని అర్థ‌మ‌వుతుంది. ఇలా హానెస్ట్ సినిమాకు నిర్మాత‌లు పుల్లారావు గారు, భ‌గ‌వాన్‌ గారు కూడా పూర్తి స‌హకారం అందించారు. వ్యాపార‌త్మ‌కంగానే కాదు, వినోదాత్మ‌కంగానే కాదు, అంద‌రినీ అల‌రించే ఎడ్యుకేటివ్ మూవీగా వారు ‘రిప‌బ్లిక్‌’ను అంద‌రినీ అల‌రించేలా రూపొందించి మ‌న ముందుకు తీసుకువ‌స్తున్నారు. నిర్మాత‌ల ప్ర‌య‌త్నాన్ని నేను మ‌న‌స్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ప్ర‌జ‌లు, ప్రేక్ష‌కులు కూడా వారి ప్ర‌య‌త్నాన్ని ఆశీర్వ‌దిస్తార‌ని న‌మ్ముతున్నాను. ఆలోచ‌న రేకెత్తించే ఇలాంటి సినిమాలు రావాలి. ఓటర్లలో ఓ రెవల్యూష‌న్ రావాలని యూనిట్ చేసిన ప్ర‌య‌త్నాన్ని అప్రిషియేట్ చేస్తున్నాను. రిప‌బ్లిక్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌డం గొప్ప అవ‌కాశంగా భావిస్తున్నాను. జీ త‌ర‌పున ఇలాంటి సినిమాకు బ్యాకింగ్‌గా నిల‌బ‌డ్డ నా చిర‌కాల మిత్రుడు ప్ర‌సాద్‌ గారికి థాంక్స్‌. ఎంటైర్ టీమ్‌కు ఆల్ ది వెరీ బెస్ట్‌’’ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్