Tuesday, April 16, 2024
Homeసినిమారాధికా బ్యాన‌ర్ లో చిరంజీవి సినిమా

రాధికా బ్యాన‌ర్ లో చిరంజీవి సినిమా

Radhika-Chiru: మెగాస్టార్ చిరంజీవి ఇటీవ‌ల ఆచార్య సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత చిరంజీవి గాడ్ ఫాద‌ర్, భోళా శంక‌ర్, వాల్తేరు వీర‌య్య సినిమాలు చేస్తున్నారు. అలాగే ఛ‌లో, భీష్మ చిత్రాల ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల‌తో కూడా ఓ సినిమా చేస్తున్నారు. అయితే.. ఇటీవ‌ల ఆచార్య ప్ర‌మోష‌న్స్ లో భాగంగా మ‌రో ఐదు ప్రాజెక్టులు ఓకే చేశాన‌ని చిరంజీవి చెప్ప‌డం తెలిసిందే.

ఇప్పుడు ఆ ఐదు ప్రాజెక్టులో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. విష‌యం ఏంటంటే.. సీనియ‌ర్ న‌టి రాధికా ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ.. థ్యాంక్యూ డియ‌ర్ చిరంజీవి. ఫ్యూచ‌ర్ లో మా బ్యాన‌ర్ లో సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. కింగ్ ఆఫ్ మాసిస్ చిరంజీవితో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా చేసేందుకు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ అనౌన్స్ చేశారు. రాధికా ఇలా చిరంజీవితో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయ‌డం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. మ‌రి.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి డైరెక్ట‌ర్ ఎవ‌రో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్