Monday, March 16, 2026
Homeసినిమా‘గాడ్ ఫాదర్` ముంబై షెడ్యూల్ పూర్తి

‘గాడ్ ఫాదర్` ముంబై షెడ్యూల్ పూర్తి

Mumbai Schedule: మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రం ‘గాడ్ ఫాదర్’. మోహన్ రాజా దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ప్రస్తుతం ముంబైలో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇటీవ‌లే బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. `మీ ఉనికి ప్రేక్షకులకు అద్భుత కిక్‌ని ఇస్తుందనడంలో సందేహం లేదు’ అని చిరంజీవి ఈ సంద‌ర్భంగా పోస్ట్‌ చేశారు. స‌ల్మాన్ ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌ను పోషిస్తున్నారు.

చిరంజీవి, స‌ల్మాన్ ఖాన్‌పై తెర‌కెక్కిస్తున్న స‌న్నివేశాలు చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయ‌ని చిత్ర‌యూనిట్ చెబుతోంది. తెలుగులో స‌ల్మాన్‌ఖాన్ న‌టించ‌డం ప్ర‌త్యేక‌త సంత‌రించుకుంది. ఇలా మెగాస్టార్ చిరంజీవి, స‌ల్మాన్ ఖాన్‌లు ఇద్ద‌రూ ఒకే చోట కనిపించ‌డం అభిమానుల‌కు పండుగే. సోమ‌వారంతో `గాడ్ ఫాదర్` ముంబై షెడ్యూల్ పూర్త‌యింది. త‌దుప‌రి షెడ్యూల్ త్వ‌ర‌లో తెలియ‌జేయ‌నున్నారు.

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత‌లు RB చౌదరి & NV ప్రసాద్ ముంబై సెట్లో మ‌ర్యాద‌పూర్వ‌కంగా చిరంజీవి, స‌ల్మాన్ ఖాన్‌ని క‌లిశారు. ఇందులో ద‌ర్శ‌కుడు మోహన్ రాజా కూడా వున్నారు. ఈ ఫొటోను చిత్ర యూనిట్ ఈ రోజు విడుద‌ల చేసింది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో నయనతార కీలక పాత్ర పోషిస్తోంది. కొణిదెల సురేఖ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Also Read : గాడ్ ఫాద‌ర్ సెట్లోకి సల్మాన్ కు గ్రాండ్ వెల్ కమ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular