Friday, March 29, 2024
Homeసినిమాగాడ్ ఫాద‌ర్ సెట్లోకి సల్మాన్ కు గ్రాండ్ వెల్ కమ్

గాడ్ ఫాద‌ర్ సెట్లోకి సల్మాన్ కు గ్రాండ్ వెల్ కమ్

Mega Salman: మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా మోహన్‌రాజా దర్శకత్వంలో రూపొందుతోన్న‌ భారీ చిత్రం గాడ్‌ఫాదర్‌. ఇది మ‌ల‌యాళంలో విజ‌యం సాధించిన లూసీఫ‌ర్ మూవీకి రీమేక్ గా రూపొందుతోంది. ఇందులో న‌య‌న‌తార‌, స‌త్య‌దేవ్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. అలాగే బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్న‌ట్టుగా గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ వార్తలను నిజం చేస్తూ.. తాజాగా గాడ్‌ఫాదర్‌ షూటింగ్‌ సెట్‌లోకి అడుగుపెట్టాడు స‌ల్మాన్ ఖాన్.

ఈ వార్త‌ను స్వయంగా చిరంజీవి ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. సల్మాన్‌ తో కలిసి ఉన్న ఫొటోను షేర్‌ చేస్తూ “గాడ్ ఫాదర్ సెట్లోకి స్వాగతం. మీ రాక ప్రతి ఒక్కరికి ఆనందాన్ని ఇచ్చింది. ఉత్సాహాన్ని నెక్ట్స్‌ లెవెల్‌కి తీసుకెళ్లింది. మీతో స్క్రీన్‌ని షేర్‌ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీ ప్రజెన్స్ ప్రేక్షకులకు అద్భుతమైన కిక్‌ని అందిస్తుందని చెప్పడంలో ఎంటువంటి సందేహం లేదు” అంటూ సల్మాన్‌కి గ్రాండ్‌గా స్వాగతం పలికారు చిరంజీవి.

ప్రస్తుతం వీరిద్దరి ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. లూసిఫర్‌లో పృథ్వీరాజ్‌ కుమార్‌ పోషించిన పాత్రను గాడ్‌ఫాదర్‌లో సల్లూభాయ్‌ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. సూపర్‌గుడ్ ఫిల్మ్‌ బ్యానర్‌, కలిసి కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మ్యూజిక్‌ సెన్షేషన్‌ ఎస్‌.థమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. మ‌రి.. గాడ్ ఫాద‌ర్ మూవీతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మెగాస్టార్ ఎలాంటి రికార్డులు సెట్ చేస్తారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్