Tuesday, September 17, 2024
HomeTrending Newsఎన్ఎస్ఈ మాజీ సీఈవో చిత్రా రామ‌కృష్ణకు బెయిల్

ఎన్ఎస్ఈ మాజీ సీఈవో చిత్రా రామ‌కృష్ణకు బెయిల్

నేష‌న‌ల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ మాజీ సీఈవో చిత్రా రామ‌కృష్ణకు ఢిల్లీ హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. ఎన్ఎస్ఈ ఉద్యోగుల ఫోన్ ట్యాంపింగ్‌తో సంబంధం ఉన్న మ‌నీల్యాండ‌రింగ్ కేసులో ఆమెకు బెయిల్ ఇచ్చారు. ఇప్ప‌టికే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఢిల్లీ కోర్టు ఆమెకు బెయిల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. iSec అనే సైబ‌ర్ సెక్యూర్టీ సంస్థ‌కు అక్ర‌మంగా 4.54 కోట్లు చెల్లించిన‌ట్లు ఆమెపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆ సంస్థ ఎన్ఎస్ఈ ఉద్యోగుల ఫోన్ల‌ను ట్యాప్ చేసిన‌ట్లు కేసు న‌మోదైంది.

సైబ‌ర్ లోపాల‌ను స్ట‌డీ చేసేందుకు ఫోన్ కాల్స్‌ను ప‌రీక్షిస్తున్న‌ట్లు చెప్పిన ఆ సంస్థ ర‌హ‌స్యంగా టాప్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఎక్స్‌చేంజ్‌కు చెందిన స‌మాచారాన్ని ఉద్యోగులు లీక్ చేస్తున్నారా లేదా అని తెలుసుకునేందుకు ఎన్ఎస్ఈ మాజీ సీఈవో చిత్ర రామ‌కృష్ణ‌, ర‌వి న‌రైన్‌లు iSec సేవ‌ల్ని వాడిన‌ట్లు సీబీఐ అనుమానం వ్య‌క్తం చేసింది. 2022 మార్చిలో చిత్రా రామ‌కృష్ణను సీబీఐ అరెస్టు చేసింది.
RELATED ARTICLES

Most Popular

న్యూస్