మహిళల టి 20 వరల్డ్ కప్ లో ఆతిథ్య సౌతాఫ్రికా తొలి విజయం అందుకుంది. న్యూజిలాండ్ పై 65 పరుగుల తేడాతో గెలుపొందింది. 133 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్…సౌతాఫ్రికా బౌలర్ల దెబ్బకు 67పరుగులకే కుప్పకూలింది.
పార్ల్ లోని బొలాండ్ పార్క్ మైదానంలో జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 13 పరుగులకే రెండు వికెట్లు (టాజ్మిన్ బ్రిత్స్-1; కాప్-9) కోల్పోయింది. క్లో టైరన్-40; నాదిన్ డి క్లెర్క్-28; సోనే లూయూస్-22 పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 132పరుగులు చేసింది.
సౌతాఫ్రికా బౌలర్లలో ఈడెన్ కార్సన్, తుహుహు చెరో రెండు; జేన్సన్ ఒక వికెట్ పడగొట్టారు.
పరుగుల ఖాతా తెరవకముందే వికెట్ కోల్పోయిన కివీస్ 31 పరుగులకే మొత్తం ఐదు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు ఇద్దరో డకౌట్ కావడం విశేషం. జట్టు మొత్తంలో ముగ్గురే..కెప్టెన్ సోఫీ డేవిన్ (16); జెస్ కెర్ర్ (11); అమేలియా కెర్ర్ (10) రెండంకెల స్కోరు చేయగలిగారు. 18.1 ఓవర్లలో 67 పరుగులకే కివీస్ ఆలౌట్ అయ్యింది.
మల్బా మూడు; మరిజాన్నే కాప్, క్లో టైరన్ చెరో రెండు; షబ్నిమ్ ఇస్మాయిల్, అయబొంగా కాక చెరో వికెట్ పడగొట్టారు.
ఆల్ రౌండ్ ప్రతిభ చూపిన క్లో టైరన్ కే ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.