Sunday, March 15, 2026
Homeసినిమా24న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న‘చోర్ బజార్’

24న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న‘చోర్ బజార్’

Chor Bazar: ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా ‘చోర్ బజార్’. గెహన సిప్పీ నాయికగా నటిస్తోంది. దళం, జార్జ్ రెడ్డి సినిమాలతో తన మార్కు క్రియేట్ చేసుకున్న జీవన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఈనెల 24న గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న “చోర్ బజార్” సినిమా ట్రైలర్ ఇటీవల బాలకృష్ణ చేతులమీదుగా విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.

చోర్ బజార్ సినిమా పాటలు హిట్ అయ్యాయి. ట్రైలర్ కు మంచి టాక్ వచ్చింది. ఇవన్నీ సినిమా మీద పాజిటివ్ బజ్ తీసుకొచ్చాయి. బిజినెస్ సర్కిల్స్ లో క్రేజ్ ఏర్పడింది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పిస్తుండటం మూవీ స్థాయిని మరింత పెంచిందని చెప్పుకోవచ్చు. ఈనెల 24న సినిమాను విడుదల చేస్తున్నట్లు దర్శకనిర్మాతలు తాజాగా ప్రకటించారు.

Also Read : బాలకృష్ణ చేతుల మీదుగా ‘చోర్ బజార్’’ ట్రైలర్ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular