Friday, April 19, 2024
HomeTrending Newsమంగోలియాలో బుద్దపూర్ణిమ వేడుకలు

మంగోలియాలో బుద్దపూర్ణిమ వేడుకలు

బుద్ధ పూర్ణిమ సందర్భంగా మంగోలియాకు నాలుగు పవిత్ర అవశేషాలను తీసుకెళ్ళిన భారత బృందం ఉలాన్ బటార్ చేరుకుంది. భారత బృందానికి ఉలాన్ బటార్ లో ఘన స్వాగతం లభించింది. కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు నేతృత్వంలోని 25 మంది సభ్యుల ప్రతినిధి బృందం 11 రోజుల ప్రదర్శన కోసం భారతదేశం నుండి మంగోలియాకు పవిత్ర అవశేషాలను  తీసుకొచ్చింది. రేపు జూన్ 14 న మంగోలియన్ బౌద్ధ పూర్ణిమ పండుగ సందర్భంగా, గండన్ మొనాస్టరీ ప్రాంగణంలోని బట్సాగన్ ఆలయంలో బుద్ధ భగవానుడి నాలుగు పవిత్ర అవశేషాలను ప్రదర్శిస్తారు. నేషనల్ మ్యూజియంలో ఉన్న పవిత్ర బుద్ధ అవశేషాలను ‘కపిలవస్తు రెలిక్స్’ అని పిలుస్తారు (1898లో బీహార్‌లోని కపిల్వాస్తు నుండి కనుగొనబడింది).

ఈ పవిత్ర అవశేషాలకు మంగోలియాలో రాష్ట్ర అతిథి హోదా లభించింది. భారత వైమానిక దళం పవిత్ర అవశేషాలను తీసుకువెళ్లడానికి ప్రత్యేక విమానం C-17 గ్లోబ్ మాస్టర్‌ను అందించింది. రెండు బుల్లెట్ ప్రూఫ్ కేసింగ్‌లు అలాగే రెండు సెరిమోనియల్ శవపేటికలను రెండు అవశేషాలను భారత ప్రతినిధి బృందం తీసుకువచ్చింది. అవశేషాలను మంగోలియా సాంస్కృతిక మంత్రి స్వీకరించారు. మంగోలియాలో లభ్యమయ్యే బుద్ధ భగవానుడి అవశేషాలు కూడా భారతదేశంలోని అవశేషాలతో పాటు ప్రదర్శించబడతాయి.

భారత్-మంగోలియా సంబంధాలలో ఇది మరో చారిత్రక మైలురాయి అని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ఇది రెండు దేశాల మధ్య సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక సంబంధాలను మరింత పెంచుతుంది. 2015లో మంగోలియాలో పర్యటించిన తొలి ప్రధాని ప్రధాని నరేంద్ర మోదీ అని రిజిజు చెప్పారు. ఇప్పుడు అవశేషాలను మంగోలియాకు తీసుకురావటం భారత విధానం పొడిగింపు అన్నారు.

Also Read : హైదరాబాద్ లో బుద్ద పూర్ణిమ వేడుకలు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్