Thursday, April 25, 2024
Homeసినిమాచైతు 'కస్టడీ' లేటెస్ట్ అప్ డేట్ ఏంటి?

చైతు ‘కస్టడీ’ లేటెస్ట్ అప్ డేట్ ఏంటి?

అక్కినేని నాగచైతన్యకు మజిలీ, వెంకీమామ, లవ్ స్టోరీ, బంగార్రాజు..  వరుసగా విజయాల తర్వాత థ్యాంక్యూ తీవ్రంగా నిరాశ పరిచింది. ఆ తర్వాత  హిందీలో తొలిసారి నటించిన లాల్ సింగ్ చడ్డా కూడా ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఈ రెండు సినిమాలూ ఫెయిల్ అవ్వడంతో కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్షన్ లో రూపొందుతోన్న ‘కస్టడీ‘ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు.  ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్ లో రూపొందిస్తున్నారు.  చైతన్య కానిస్టేబుల్ క్యారెక్ట్ చేస్తుండడం విశేషం. ఈ మూవీలో చైతన్యకు జంటగా ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి నటిస్తుంది. అరవింద్ స్వామి, ప్రియమణి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాతో నాగచైతన్య కోలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుండడం విశేషం. చైతన్య పుట్టిరోజు సందర్భంగా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. దీనికి అనూహ్య స్పందన వచ్చింది.

కస్టడీ లేటె్స్ట్ అప్ డేట్ ఏంటంటే… ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. నాగచైతన్య పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా కస్టడీ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో జనవరి 1న ఈ సినిమాకు సంబంధించిన బ్లాస్టింగ్ అప్ డేట్ ఇవ్వనున్నట్టుగా తెలియచేశారు. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి నెటిజన్లు అంతా టీజర్ గురించేనని భావిస్తున్నారు. సంక్రాంతికి టీజర్ రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేస్తారు అనుకుంటున్నారు. ఇది నిజమో కాదో తెలియాలంటే జనవరి 1 వరకు వేచి చూడాల్సిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్