Thursday, March 19, 2026
HomeTrending Newsఫైబర్‌ గ్రిడ్‌ కుంభకోణం: 19మందిపై ఎఫ్‌ఐఆర్‌

ఫైబర్‌ గ్రిడ్‌ కుంభకోణం: 19మందిపై ఎఫ్‌ఐఆర్‌

ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ గ్రిడ్‌ టెండర్ల కుంభకోణానికి సంబంధించి 19 మందిపై సీఐడీ.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఎఫ్‌ఐఆర్‌ను న్యాయస్థానానికి సీఐడీ సమర్పించింది. సీఐడీ దర్యాప్తులో అక్రమాలు బట్టబయలయ్యాయి. గత ప్రభుత్వం టెరా సాఫ్ట్ కు అడ్డగోలుగా టెండర్లు కట్టబెట్టింది. రూ.330 కోట్ల తొలిదశ ఆఫ్టికల్‌ ఫైబర్‌ గ్రిడ్‌ టెండర్లలో అవినీతి జరిగింది. వేమూరి, టెరాసాఫ్ట్‌, అప్పటి అధికారులపై  కేసు నమోదైంది. సుమారు రూ.2వేల కోట్ల కుంభకోణం జరిగినట్లు అంచనా. బ్లాక్‌ లిస్టులోని కంపెనీకి గత ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ పనిలో తమ కంపెనీకి అపార అనుభవం ఉన్నట్లు నకిలీ సర్టిఫికెట్‌తో మోసం చేసినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular