Sunday, June 7, 2026
HomeTrending Newsఆర్ఆర్ఆర్ విడుదల వాయిదా

ఆర్ఆర్ఆర్ విడుదల వాయిదా

అనుకున్నట్లే ‘ఆర్ఆర్ఆర్’ విడుదల వాయిదా పడింది. అక్టోబర్ 13న సినిమా విడుదల కావడంలేదు. భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఈ చారిత్రాత్మక సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని దర్శకుడు రాజమౌళి భావిస్తున్నారు. కానీ కరోనా మూడో దశ నేపథ్యంలో ఇంకా పూర్తి స్థాయిలో థియేటర్లు తెరుచుకోలేదు. ప్రపంచ సినిమా మార్కెట్ లో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం కారణంగానే సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేయలేకపోతున్నామని యూనిట్ ప్రకటించింది.  ప్రపంచ సినిమా మార్కెట్ పరిస్థితి ఆశాజనకంగా ఉన్నప్పుడు,  థియేటర్లు పూర్తి స్థాయిలో తెరిచిన తరువాతే సినిమాను విడుదల యాలని దర్శక నిర్మాతలు నిర్ణయించారు.

బాహుబలి తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు నటిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ పాన్ ఇండియా మూవీని తొలుత గత జులై లో విడుదల చేయాలని నిర్ణయించారు, కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడడంతో దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు.

ఆర్ఆర్ఆర్ సంక్రాంతికి రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని వినిపిస్తోంది, అయితే సంక్రాంతికి పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు సినిమాలు విడుదల ప్రకటించడంతో క్రిస్మస్ కానీ.. రిపబ్లిక్ డే కి కానీ ఆర్ఆర్ఆర్ ను విడుదల చేస్తారని భావిస్తున్నారు. దసరాకు ‘ఆర్ఆర్ఆర్’ విడుదల అనుమానమే అన్న విషయాన్ని ‘ఐ-ధాత్రి’ ఆగస్ట్ 12 నే తెలియజేసింది. త్వరలో విడుదల తేదీని వెల్లడిస్తామని యూనిట్ ప్రకటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular