Sunday, September 8, 2024
Homeసినిమాసినిమాటోగ్రాఫర్ వి. జయరాం కన్నుమూత

సినిమాటోగ్రాఫర్ వి. జయరాం కన్నుమూత

సీనియర్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్ వి. జయరాం కరోనాతో కన్నుమూశారు. ఆయనకు ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది. చికిత్స పొందుతూనే గురువారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. అటు మలయాళం, ఇటు తెలుగు సినిమా రంగంలోనూ సినిమాటోగ్రాఫర్ గా ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారాయన. తెలుగులో నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, చిరంజీవి, మోహన్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాలకూ, మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్, సురేష్ గోపి లాంటి హీరోల సినిమాలకూ ఆయన సినిమాటోగ్రాఫర్ గా పని చేసి మంచి గుర్తింపు తెచుకున్నారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన అనేక సినిమాలకు ఆయన సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. ఆయన సినిమాటోగ్రఫీలోనే ‘పెళ్లి సందడి’ చిత్రం రూపొందింది. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

ఆయన సొంతూరు వరంగల్. చిత్ర పరిశ్రమ హైదరాబాద్ లో స్థిరపడ్డాక తన మకాంను కూడా హైదరాబాద్ కు మార్చారు. అటు మలయాళం, ఇటు తెలుగు సినిమా రంగంలోనూ సినిమాటోగ్రాఫర్ గా ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారాయన. 13 ఏళ్ల వయసులో ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ కుర్రాడు లెజండరీ సినిమాటోగ్రాఫర్ అవుతారని ఎవరైనా ఊహించగలరా? పైగా మలయాళం, తెలుగులో ఆయన మోస్ట్ వాంటెడ్ సినిమాటోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్నారు. ఈ రెండు భాషల్లోని సూపర్ స్టార్ల సినిమాలకు పని చేసిన అనుభవం ఆయనది. ఆయన సినిమాటోగ్రాఫర్ గా మారిన వైనం కూడా ఓ సినిమాలానే ఉంటుంది. ఆయన పుట్టి పెరిగింది వరంగల్. ఆయన బాబాయికి అక్కడ ఓ ఫొటో స్టూడియో ఉండేది. స్కూలు అయ్యాక రోజూ వెళ్లి ఆ స్టూడియోలో కూర్చోవడం అలవాటుగా మారింది. మహానటుడు ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం, పోస్టర్ల మీద ఎన్టీఆర్ ఫొటోలు చూసి మురిసిపోయేవారు. ఆ మహానటుడు నటించిన ఆఖరి చిత్రం ‘మేజర్ చంద్రకాంత్’కు జయరామే సినిమాటోగ్రాఫర్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్