మణిపూర్ ఘటనలపై మహిళా న్యాయమూర్తులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. రిటైర్డ్ మహిళా న్యాయమూర్తులు, నిపుణులతో సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ వెల్లడించారు. సిట్ సభ్యులు ఆ రాష్ట్రంలో పర్యటించి బాధితులతో మాట్లాడతారని అన్నారు.
మరోవైపు మణిపూర్‌లో జరుగుతున్నది జాతి హింస కాదని, మయన్మార్ నుంచి జరుగుతున్న డ్రగ్స్ అక్రమ రవాణా వ్యవహారమని మోతీ కమ్యూనిటీ దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.